Horoscope Today: ఈ రోజు(సెప్టెంబరు 30) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. సాయిబాబా దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మనోధైర్యంతో ఇబ్బందులు తొలుగుతాయి. శివారాధన శుభప్రదం.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.
మీదైన రంగంలో ప్రగతి సాధిస్తారు. బంధు,మిత్రులను కలుపుకొనిపోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దుర్గా ఆరాధన చేస్తే మంచిది.
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురవకుండా ముందుచూపు అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన మంచిది.
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్ధిక వ్యవహారాల్లో మోసపోకుండా చూసుకోవాలి. సరైన సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి.
ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.
మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టనివారితో మిత భాషణం అవసరం. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.
శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.
అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.
పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరారాధన శుభప్రదం.