Horoscope Today: ఈ రోజు(సెప్టెంబరు 24) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

అనుకున్నది సాధించేవరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సాయం అందుతుంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభిస్తే మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. అవసరానికి తగ్గట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభకరం

శుభ సమయం. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వృథా చేయకండి.. శివారాధన శుభప్రదం.

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

మీ మీ రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం

కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరకశ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ శుభాన్ని కలిగిస్తుంది.

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. ఉమామహేశ్వరస్తోత్రం చదివితే మంచిది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.