Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 14) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అలసట పెరగకుండా చూసుకోవాలి. శత్రువుల విషయంలో కాస్త అప్రమ్తత్తంగా ఉండాలి. లక్ష్మీస్తుతి శుభాన్ని ఇస్తుంది.
ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. కుటుంబసభ్యుల మాటకు విలువ ఇవ్వండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగ్గట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్ని ఇస్తుంది.
ప్రగతి సాధిస్తారు. ముఖ్యమైన లావాదేవీల్లో సొంతనిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. విష్ణు సందర్శనం శుభప్రదం.
మిశ్రమ కాలం. మనోబలాన్ని కోల్పోరాదు. మంచి పనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు.శారీరక శ్రమ పెరుగుతుంది. ఈశ్వరధ్యానం శుభప్రదం.
మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభించాలి. బాగా కష్టపడాల్సిన సమయం ఇది. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
చేపట్టిన కార్యక్రమాలను మనోబలంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గోసేవ చేయడం మంచిది.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.
చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. బంధు,మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధనను మానవద్దు.
ముఖ్య వ్యవహారాలు, విషయాలలోను కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గాస్తోత్రం చదవాలి.
శుభాలు ఉన్నాయి. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. ధర్మసిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.