Horoscope Today: ఈ రోజు(నవంబర్19) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
శుభకాలం. అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్టదైవారాధన చేస్తే మంచిది.
ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనః పీడ ఉంది. మానసిక ప్రశాంతత కోసం శివనామాన్ని జపించడం ఉత్తమం.
పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మనశ్శాంతిని తగ్గిస్తుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.
ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శివనామాన్ని జపించాలి.
ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. ప్రారంభించిన పనులను బుద్దిబలంతో చక్కగా పూర్తిచేయగలుగుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. సొంతనిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేయగలుగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. సూర్య ఆరాధన శుభప్రదం.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనోబలం పెరగటానికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.
మీ మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. కీలక విషయాలను కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకుంటే మంచిది. కలహసూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన మేలు చేస్తుంది.
శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.