Horoscope Today: ఈ రోజు(మార్చి 15) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఈ రోజు మీలో దైవచింతన ఉంటుంది. గతంలో చేసిన తప్పిదాలకు మీరు బాధ్యత తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందులో అంతగా సత్సంబంధాలు లేని మీ పొరుగువారు కూడా ఉంటారు. భవిష్యత్‌తో మీరు అందుకునే విజయాలకు ఇది మార్గం అవుతుంది.
సాధారణంగా మొదలైన రోజు అసాధారణ సాయంత్రంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం ఒత్తిడితో నిండి ఉంటుంది. మీకు నచ్చిన వారితో గడుపుతారు కాబట్టి సాయంత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది.
మీ ఆహార అలవాట్లకు ఈ రోజు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఏదైనా మీటింగ్ లేదా ఏదైనా కొత్త బాధ్యతల వైపు వెళ్తారు. పనిలో మీ సీనియర్ల నుంచి సహకారం, స్ఫూర్తి అందుతాయి.
ఈ రోజు మొదటి గంటలో మీలో కోపం ఎక్కువగా ఉంటుంది. మీ బీపీ చెక్ చేయించుకోవడం మంచిది. ధ్యానం చేయండి. పనిలో నిగ్రహాన్ని కోల్పోకండి. వాటి పరిణామాలు మీరు ఊహించిన దానికన్నా తీవ్రంగా ఉంటాయి.
మీలో చక్కని కళాత్మకత ఉంది. దాన్ని ప్రదర్శించే అవకాశం ఈ రోజు మీకు లభించవచ్చు. మీలో ఉత్సాహం, ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు చేస్తున్న పనిని మరింత చక్కగా నిర్వర్తించడం ద్వారా మీ విమర్శకుల నోర్లు మూయించవచ్చు.
ఉదయం ఆలసట కలిగించిన సాయంత్రం ఉత్సాహభరితంగా మారుతుంది. అయితే సాయంత్రమయ్యే సరికి మరో అవాంతరం వచ్చిపడుతుంది. దాంతో మీరు బాగా ఒత్తిడికి గురవుతారు. అయితే రోజు ముగిసే సమయానికి మీకు నచ్చిన వారి చెంత ఉంటారు కాబట్టి ఆ బాధలన్నీ తొలగిపోతాయి.
ఈ రోజు ఉదయం సహకరించకపోయినా, మధ్యాహ్నం పరిస్థితి మారవచ్చు. మీ మానసికంగానూ, శారీరకంగానూ అలసిపోయి ఉంటారు. అలసట, ఆందోళన, నెగిటివిటీలతో సతమతమవుతూ ఉంటారు. మీరు యోగా, ధ్యానం ప్రాక్టీస్ చెయ్యండి. మీ ఉద్వేగం అదుపులోకి వస్తుంది. మీ ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ మీరు చక్కగా వ్యవహరించగలుగుతారు. ఉదయ కాలపు లోటు పాట్లన్నీ భర్తీ చేసే విధంగా, మీ ఇంట్లో సాయంత్రం పూట మంచి ఆహ్లాదభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు కొత్త ప్రాజెక్టులూ, కొత్త అసైన్ మెంట్లలోకి దూసుకుని వెళ్లవచ్చు. మీ ప్రత్యర్థులు ఓటమి పాలవుతారు.
ఇది మీకు అతి సాధారణమైన రోజని గ్రహబలం అంటోంది. మీకు కావలసిన లక్ష్యం వైపు సూటిగా పయనించగలిగితే ఈ రోజు మీకు సాఫల్యాన్ని అందిస్తుంది. మీరు ఈ రోజు విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల్లో జరుగుతున్న అవసరంలేనీ చర్చలు ముగించడంలో మీరు అందెవేసిన చెయ్యిగా ఉంటారు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆలోచించి ఖర్చు చెయ్యండి. అనవసర పనులకు విలాసంగా ఖర్చు చేస్తే మీరు ఆర్థికంగా బాగా నష్టపోతారు. విద్యార్థులకు ఇది గడ్డు సమయం. ఈ రోజు వారికి అనుకూలమైన రోజు కాదు.
ఈ రోజు ఉదయం కాస్త ఇబ్బందులు ఉంటాయి. సాయంత్రానికి పరిస్థితులు మారుతాయి. మీరు వాహనం నడిపేటప్పుడు మరీ వేగంగా వెళ్లకండి. ప్రమాదాలు సంభవించే సూచనలున్నాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. కుటుంబ సభ్యులతో వాగ్వాదం చేయకండి.
ఈ రోజు ముఖ్యంగా వ్యాపారస్తులకు బాగుంది. ఉదయం నుంచి ఇంటి వాతావరణం బాగుంటుంది. మధ్యాహ్నానికి కాస్త డల్ అవుతారు. కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులను అదుపులో పెట్టుకోండి. మీరు అవమానానికి గురయ్యే పరిస్థితి ఉంది జాగ్రత్త.
ప్రతిభతో పనిచేస్తారు. కానీ ఫలితాన్ని ఆశించవద్దు. ఈ రోజు గొప్ప అద్బుతాలు జరిగే సూచనలేమి లేవు. మీ పిల్లలు, భాగస్వామిపై అరుస్తారు. కాని అవేవి పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
మీరు సృజనాత్మకత సామర్థ్యం చూపడానికి చర్చల్లో పాల్గొనండి. మీరు ఈ రోజు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. శారీరకంగా మీ ఫిట్‌నెట్ కొద్దిగా తగ్గవచ్చు. కానీ మీ ఇంట్లో ఉండే స్నేహపూర్వక వాతావరణంలో మీరు త్వరగా కోలుకుంటారు. విదేశాల్లో నివసించే మీ బంధువులు, స్నేహితుల నుంచి మంచి శుభవార్త అందుకుంటారు.