Horoscope Today January 4th 2024 : జనవరి 4 (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : సోమవారం మేషరాశి వారికి విషాదాలు, నిరాశలు ఉండనే ఉండవు. మీరు ఈ రోజంతా అన్ని విధాలుగానూ సరదాగా, నవ్వుతూ, సంతృప్తికరంగా గడుపుతారు. మిమ్మల్ని లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. మీ అభివృద్ధిని మీ ప్రయత్నాల ద్వారా చక్కగా చూపించగలుగుతారు. మీ సంబంధ బాంధవ్యాలు, మీ నెట్ వర్కింగ్ నైపుణ్యాల వల్ల లాభాలు పడవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని, సంతోషాన్ని కలిపి ఆనందించండి. చిన్నపాటి ప్రయాణం ఉందని ఫలితాలు చెబుతున్నాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని, ఆనందాన్ని ఇతరులకు పంచుకుంటారు.

వృషభం (Taurus) : మీరు మీ ఉన్నతమైన మానసిక స్థాయితో, ఆలోచనలతో, మంచి మాటకారితనంతో అందరినీ మెప్పిస్తారు. విషయాల్లోని సున్నితత్వం వల్ల మీరు అర్థం చేసుకునే వ్యవహార సరళితో ఉండాలి. ఈ రోజు మీకు సదస్సులు, చర్చలకు చాలా అనుకూలమైన రోజు. మీరు అద్భుతంగా రాణిస్తారు. ఒకవేళ కోరుకున్న ఫలితం వెంటనే లభించక పోయినా నిరాశ చెందకండి. మెల్లగా పరిస్థితులు చక్కబడతాయి. జీర్ణకోశానికి సంబంధించిన అస్వస్థతలు బాధ పెట్టవచ్చు. కాబట్టి పరిస్థితి అంతవరకు రానివ్వకండి.

మిథునం (Gemini) : ఈ రోజు మీరు అనిశ్చితిలో, సందిగ్ధావస్థలో ఉంటారు. చర్చలు, వాదనల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతో స్థిరాస్తులు, వారసత్వపు ఆస్తుల గురించిన చర్చ వాయిదా వెయ్యండి. లేకుంటే మీరు గాయపడతారు. వీలైనంతవరకు ఈరోజు ప్రయాణం చెయ్యకండి.

కర్కాటకం (Cancer) : మీరు మీ సోదరప్రేమ చూపించవలసిన రోజు ఇదే. మీరు అన్ని రకాల పరిచయాల నుంచీ లబ్ధి పొందుతారు. స్నేహితులతో, సన్నిహిత సంబంధీకులతో చక్కగా ఆనందించండి. మీరు చాలా ఎమోషనల్. మీరు చేసిన అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు సుందరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ రోజు ఈ సమయం సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు తెప్పించేదిగా ఉంటుంది. మీరు ఆర్థికపరంగా కూడా మంచి స్థితి సంపాదిస్తారు.

సింహం (Leo) : ఇదొక మామూలు రోజు. మీరు చేసిన ప్రయత్నాలకు రావలసిన ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. అంతే ఫలితాలు కాదు అవి మీరు ఆశించిన స్థాయిలో ఉండవు. అయినా మీరు నిరాశ చెందవద్దు. మీరు ఇప్పుడు ఏదో కోల్పోయినట్టు ఫీలవుతున్నారు. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. ఒక దూరపు సంబంధం బాగా బలపడుతోంది. అది మీకు తరువాత కాలంలో లాభిస్తుంది. డబ్బు మంచినీళ్ల ప్రాయంలాగా ఖర్చు చేయకండి.

కన్య (Virgo) : ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీరు శారీరకంగా, మానసికంగా చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ఆర్థికపరంగా సంతృప్తికరంగా ఉంటారు. మీరు స్నేహితులతో, ప్రియమైనవారితో సరదా సమయాన్ని గడపవచ్చు. ప్రయాణం అనుకూలం.

తుల (Libra) : కోపం, పరుష పదాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు మీరు మాట్లాడకుండా ఉండండి. వ్యాపారంలోనూ మీకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఎవరితోనూ ఘర్షణ పడకండి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర బంధువులతో మీ సంబంధాలను చెడగొట్టుకుంటారు.

వృశ్చికం (Scorpio) : అద్భుతమైన రోజు ఇది. ఈ రోజు మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పనిని మీ ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది. మీరు మీకు కావాల్సిన వ్యక్తిని ఈ రోజు మీరు కలుసుకుంటారు.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు అదృష్టం మీదే. మీరు మీ ఆర్థిక విషయాలను బాగా మేనేజ్ చేసుకుంటారు. మీరు మీ పని విజయవంతంగా పూర్తి చేసుకుని మిగతా వారి పనిలో కూడా సహాయం అందజేస్తారు. మీరు బిజినెస్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రోజు బిజినెస్ పరంగా ప్రయాణం ఉండవచ్చు. మీరు మీ బాస్‌ను మీ టాలెంట్‌తో ఇంప్రెస్ చేశారు , కాబట్టి ప్రమోషన్ ఛాన్స్ కాదనలేనిది.

మకరం (Capricorn) : ఈ రోజు మిశ్రమ ఫలితాలను చూడాల్సి ఉంటుంది. ఈ రోజును రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటేమో బాగా అనుకూలమైన భాగం, మరొకటేమో సాదాసీదాగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు, మేధోపరమైన విషయాలకు అనుకూలమైన సమయం. చర్చల్లో మీరు రాణిస్తారు. మీ ఆలోచనలు ఇతరులను ఆకట్టుకుంటాయి.

కుంభం (Aquarius) : అనైతిక పథకాలు, ఆలోచనలు, ఊహలకు మీరు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో ఘర్షణలు ఏర్పడకుండా చూసేందుకు మీరు మీ కోపాన్ని, మాటలను వీలైనంత అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈ రోజు మీరు చాలా సున్నితంగా ఉంటారు. ఈ కారణంగా ప్రతికూల, నిరాశతో కూడిన ఆలోచనలు మీ మనస్సులోకి వస్తాయి. మీ ఆలోచనలను సరైన దారిలో పెట్టుకోండి.

మీనం (Pisces) : మీరు రెండు గ్రూపుల్లో ఉంటారు కాబట్టి అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసేందుకు చాలా ఇబ్బందిపడతారు. అయితే ఈ రోజు మీరు కావాల్సినవన్నీ పూర్తి చేస్తారు. మీ ప్రతిభను ప్రదర్శిస్తారు. అందరూ దాన్ని ప్రశంసిస్తారు. స్త్రీలకు ఈ రోజు లాభదాయకమైన రోజు.