Horoscope Today January 3rd 2024 : జనవరి 3 (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. ప్రయాణాలు కూడా అనుకూల ఫలితాలు ఇస్తాయి. అన్ని రంగాలవారికీ విశేషమైన ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజంతా సంతోషంగా గడుపుతారు.
వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు అద్భుతంగా రాణిస్తారు. మీ మాటకారితనంతో అందరినీ మెప్పిస్తారు. సదస్సులు, సమావేశాల్లో మీ శైలిలో అందరినీ ఆకట్టుకుంటారు. కోరుకున్న ఫలితాలు వెంటనే రాకపోయినా, నిరాశ చెందకండి. త్వరలోనే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు రావచ్చు. జాగ్రత్త!
మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు అనిశ్చితితో, సందిగ్ధావస్థలో ఉంటారు. అనవసర చర్చలు, వాదనల్లోకి దిగకూడదు. స్థిరాస్తి, వారసత్వపు ఆస్తుల తగాయిదాలను వాయిదా వేసుకోవడం మంచిది. లేదంటే తీవ్రంగా నష్టపోతారు. వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారు తమ సోదరులకు అండగా ఉండాలి. అప్పుడే అందరూ లాభపడతారు. కొత్త వ్యాపార ఆలోచన చేస్తారు. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. కానీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి అంత అనుకూలంగా ఉండదు. మీ కష్టానికి తగిన ఫలితం వెంటనే రాదు. ఆశించిన స్థాయిలో పనులు కావు. కానీ నిరాశ చెందకూడదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మనోధైర్యం కలిగి ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి ఊహించని ఘటనలు ఎదురవుతాయి. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రేమికులకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. కానీ మీలోని ప్రతిభా పాటవాలతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త!
తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మీరే ఇబ్బంది పడతారు. వ్యాపారంలోనూ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఘర్షణలకు దూరంగా ఉండాలి.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీకు కావాల్సిన వ్యక్తిని ఇవాళ కలుసుకుంటారు.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి బాగుంటుంది. మీ ప్రియమైన బంధువులు, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో సఖ్యంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు మీకు మంచి ప్రయోజనం చేకూరుస్తాయి. చర్చల్లో రాణిస్తారు. మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటారు. కానీ అనుకోని ఘటనలు కూడా ఎదురుకావచ్చు. జాగ్రత్తగా ఉండాలి.
కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు అనైతిక ఆలోచనలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో ఘర్షణలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. నిరాశ, నిస్పృహలను దరిచేరనీయకూడదు. ధ్యానం చేయడం మంచిది.
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. కళాకారులు, రచయితలు ఇవాళ అద్భుతంగా రాణిస్తారు. స్నేహితులు మీకు అండగా నిలుస్తారు. మీరు భిన్నమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగులు కూడా బాగా రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.