ETV Bharat / bharat

ఆ రాశివారు ఈరోజు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు! - Horoscope Today

Horoscope Today January 19th 2024 : జనవరి 19న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today January 19th 2024
Horoscope Today January 19th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 5:04 AM IST

Horoscope Today January 19th 2024 : జనవరి 19న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మీరు అతి దూకుడు, ఆధిపత్య ధోరణితో ఉంటారు. మీ దూకుడు లక్షణాన్ని కాస్తంత నియంత్రణలో ఉంచుకోవాలి. కొత్త పనులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొత్తవి ప్రయత్నించకండి.

.

వృషభం (Taurus) : ఈ రోజు తారా బలం మీకు అనుకూలంగా లేదు. మీరు మానసికంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అది మీ శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. పనులు కాకపోగా, మీ ప్రయత్నాలకు మెప్పు, ప్రశంసలు ఉండవు. ఖర్చులు అధికం అవుతాయి. అన్ని కోణాలూ పరిశీలించాకే, ఒక దృఢమైన నిర్ణయం తీసుకోండి. సగం ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. భాగస్వాములతో మంచిగా మెలగండి.

.

మిథునం (Gemini) : మిథున రాశివారికి ఈరోజు అద్భుతమైనది. ఈ రోజు అదృష్టం మిమ్మల్ని ముంచెత్తుతుంది. భాగస్వాములు, యజమానుల నుంచి ప్రశంసలు వస్తాయి. అన్ని రంగాల్లోనూ మీరు రాణిస్తారు.

.

కర్కాటకం (Cancer) : మీ కుటుంబంలోని చిన్నపిల్లలపై అధిక శ్రద్ధ పెడతారు. పిల్లలు వారి రోజువారీ పనులు మెరుగుపరుచుకునే విషయంలో తగిన సూచనలిస్తారు. ఇది వేడుకకు తగిన సమయంగా ఉంటుంది. పోటీలు లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలనే కోరిక మీకు కలుగుతుంది.

.

సింహం (Leo) : ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. కోరుకున్న ఫలితాలు పొందడానికి మీరు సాధారణం కంటే ఎక్కువ సమయం కష్టపడాలి. తట్టుకొని నిలబడండి.

.

కన్య (Virgo) : ఈరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి అద్భుతంగా ఉంది. మీరు ఎంత కాలం నుంచో చేసుకున్న ప్రణాళికలు అన్నీ ఇప్పుడు అమలుపరచవచ్చు. అయితే, మీరు ఈరోజు మీ జీవితంలోని ఇతర అంశాల పట్ల జాగ్రత్తగా ఉంటే మంచిది. అది మీ ఆరోగ్యం లేదా ఆర్ధిక సంబంధాలు కావచ్చు.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి సరదాగా, సంతోషంగా గడుస్తుందని ఫలితాలు చెబుతున్నాయి. మీరు మీ పాత స్నేహితులను కలుసుకునే ప్రణాళికలో ఉంటారు. ఈ సమావేశంలో అంతా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు మీరు ఉత్సాహంగా గడుపుతారు. షాపింగ్​, సినిమాకు వెళ్లే అవకాశం ఉంది. ఖరీదైన ఆభరణాలు కొనే అవకాశం ఉంది. మీ సామాజిక గౌరవం మరింత అదనపు శక్తినిస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రాశి వారికి చాలా మంచి రోజు. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. మీ సంతోషం రెట్టింపు అవటానికి మీ ఇంటి వద్ద నుంచి శుభవార్త వింటారు. సహాయ అందించే సిబ్బంది ఉండడం వల్ల మీ పనులు పూర్తి చేయడానికి మంచి వాతావరణం ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. అలాగే డబ్బు పరమైన లాభాలు మీ కోసం ఎదురు చూసున్నాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశివారికి ఈరోజు అంతగా కలిసిరాదు. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. గత రెండు రోజుల నుంచి ఉన్న ఒత్తిడి కారణంగా జీర్ణ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఉంది.

.

మకరం (Capricorn) : మకర రాశివారు ఈరోజు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. ప్రేమ విషయాలు సజావుగా సాగుతాయి. మీరు ఇంట్లో హాయిగా గడిపే అవకాశం ఉంది. గృహోపకరణ వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు.

.

కుంభం (Aquarius) : ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీ ఆందోళనలను తొలగించుకుంటే ఉత్సాహంగా ఉంటారు. మీ తోబుట్టువులతో విహారయాత్రకు వెళతారు. ఫలితంగా మీరు వారితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. స్నేహితులు, ప్రియమైన వారిని కలిసే అవకాశం ఉంది.

.

మీనం (Pisces) : మీన రాశివారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం మాట్లాడినా మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఆలోచించి ఖర్చు చేయండి. అప్పు తీసుకోకండి, ఎవరికీ ఇవ్వకండి. శారీరక ఫిట్​నెస్​పై దృష్టి పెట్టండి. ఆహారం పట్ల జాగ్రత్త వహించండి. సొంతంగా వంట చేసుకుని తినండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.