Horoscope Today January 12th 2024 : జనవరి 12న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఇవాళ ఉద్యోగులు వారి పైఅధికారులతో చర్చల్లో పాల్గొంటారు. ప్రభుత్వం నుంచి మీ కంపెనీకి ప్రాజెక్టులు వస్తాయి. పనికి సంబంధించిన పర్యటనలు మిమ్మల్ని వివిధ ప్రదేశాలకు తీసుకెళ్తాయి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
వృషభం (Taurus) : ఇవాళ వృషభరాశివారు తీర్ధయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. లేదంటే పిక్నిక్కు వెళ్తారు. ఈ రోజు మీ తారాబలం బాగుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇవాళ మంచి రోజు. తీర్ధయాత్ర సందర్శన వల్ల ఉల్లాసంగా ఉంటారు. విదేశాల్లో ఉన్న మీ ప్రియమైన వారి నుంచి మీరు మంచి శుభవార్త వింటారు. ఈ రోజు మిమ్మల్ని తలనొప్పి, జలుబు చికాకు కలిగిస్తాయి.
మిథునం (Gemini) : ఈ రోజు మీరు ఆస్తి తగాదాల్లో ఇరుక్కుంటారు. అందువల్ల ఆందోళనగా ఉంటారు. చిన్నచిన్న విషయాలు మిమ్మల్ని బాధిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత రిస్క్ తీసుకుంటారు.
కర్కాటకం (Cancer) : ఇవాళ మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. షాపింగ్ చేస్తారు. ఈ రోజంతా సరదాగా గడుపుతారు. ఈ రోజు మీ తారాబలం బాగుంది. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తిని మీరు కలుస్తారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. మీ పరువుప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఈ రోజు ఫోర్ వీలర్ వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
సింహం (Leo) : ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్నేహితులు, సహోద్యోగులు మీకు అండగా ఉంటారు. విషాదకరమైన వార్త వినే అవకాశం ఉంది. పని చేసే చోట మీ ప్రత్యర్ధులు సృష్టించిన కొన్ని ఆటంకాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. ఆందోళనగా ఉంటారు. పనిచేసే చోట పైఅధికారులతో వాదనలు చేయకండి.
కన్య (Virgo) : ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పిల్లలు, మీకు ఇష్టమైన వారి గురించి ఆలోచించి మానసిక ఆందోళన చెందుతారు. మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయండి. ఖర్చులు పెరుగుతాయి. మీ ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడండి. అప్పుడు మీ మానసిక ఒత్తడి కొంత తగ్గుతుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు.
తుల (Libra) : ఇవాళ తులరాశివారు విపరీతమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు. ఈ రోజు ఎమోషనల్గా ఉంటారు. వైవాహిక జీవితంలో అసంతృప్తి లేదా మీ తల్లితో మనస్పర్థలు రావచ్చు. జలాశయాలకు దూరంగా వుండండి. స్విమింగ్ తరగతులకు ఈ రోజు సెలవు పెట్టండి. ఈ రోజు ప్రయాణం చేయకండి.
వృశ్చికం (Scorpio) : వ్యాపారం చేయడానికి ఇది తగిన సమయం. మీరు ఆవిష్కరించే కొత్త ఉత్పత్తితో మీ ప్రత్యర్థులు కంగు తింటారు. అయినప్పటికీ తారాబలం మీకు పూర్తి అనుకూలంగా లేదు. ఆ కారణంగా మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. వీలైనంత సమయం తీసుకొని అడ్డంకులన్నీ తొలగించుకొని భారీ ప్రచారం, సంబరాలతో మీ ఉత్పత్తిని లాంఛ్ చేయండి.
ధనుస్సు (Sagittarius) : మీరు ఈరోజు గందరగోళంగా ఉంటారు. మీ కుటుంబ వాతావరణం అస్థిరంగా ఉండవచ్చు. సాధారణమైన పనులు పూర్తిచేయలేక, మీరు నిరుత్సాహంగా ఉంటారు. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీరు వృత్తిపరమైన, గృహ సంబంధిత వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు.
మకరం (Capricorn) : ఉద్యోగులు, వ్యాపారులకు ఈ రోజు కలిసివస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ కూడా రావచ్చు. పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. సాయంత్రం మీకు ఇష్టమైన వారితో సరదాగా సినిమాకి వెళ్లి హాయిగా గడపండి. ఒత్తిడి దూరమవుతుంది.
కుంభం (Aquarius) : మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మీకు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో తలదూర్చవద్దు. సరైన లబ్ధి ఉండేచోట పెట్టుబడులు పెట్టండి. ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్త వహించండి. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి.
మీనం (Pisces) : ఈ రోజు మీ మీద పని ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ మీ ప్రత్యర్థులను మట్టికరిపించడంలో మీరు వెనక్కి తగ్గరు. ఇతరుల అవసరాలపై మీరు సానుకూలంగా ఉన్నప్పటికీ అవసరమైన సందర్భాల్లో మీరు జిత్తులమారిగా కూడా ఉంటారు.