Horoscope Today : ఈ రోజు (జనవరి 12) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

ప్రారంభించబోయే పనులలో చంచల స్వభావం రానీయకండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధు,మిత్రులతో అతిచనువు వద్దు. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఉమామహేశ్వర స్తోత్రం చదివితే మంచిది.

శుభసమయం.మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ దైవారాధన మానవద్దు.

ప్రయత్నకార్యానుకూలత ఉంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. గతంలో ఆగిన పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

మంచి కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. కృష్ణాష్టకం చదివితే బాగుంటుంది.

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు.ఒక నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు.బంధు,మిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి

మంచికాలం. ప్రారంభించిన పనులను సజావుగా పూర్తిచేస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శివస్తోత్రం చదివితే బాగుంటుంది.

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు.విందు,వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.

కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం. శ్రీవిష్ణు ఆరాధన శుభప్రదం.సూర్య ఆరాధన శ్రేయోదాయకం.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది.పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి.శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.