Horoscope Today: ఈ రోజు(జవవరి 28) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

మంచి ఫలితాలను అందుకుంటారు. మీ చిత్తశుద్ధే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి.మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

మంచి కాలం. ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. చంద్రబలం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్థన మరింత మేలు చేస్తుంది.

శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.

బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి.బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు. మీ శ్రమ వృథా కాదు. మిత్రుల సహకారం ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. సూర్య ఆరాధన శుభదాయకం.

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. చంద్ర శ్లోకం చదవాలి.

మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనిని విశేషమైన కృషితో పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. ఈశ్వర శ్లోకాలు చదవాలి.

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. షష్ఠమ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.

సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. చతుర్థ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి దర్శనం శుభప్రదం.

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.