Horoscope Today : ఈ రోజు(ఆగస్టు 31) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
తలపెట్టిన పనులు శీఘ్ర విజయాన్నిస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదివితే మంచి జరుతుతుంది
సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతతకై లక్ష్మీ సందర్శనం ఉత్తమం.
మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చును. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం మంచిది.
మీరు చేపట్టిన పనుల్లో అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని వీడండి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా వారి నామాన్ని జపించడం ఉత్తమం.
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబందించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకం చదవాలి.
శుభకాలం మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉత్సాహం తగ్గకుండా ముందుకుసాగాలి. కోపాన్ని తగ్గించుకోకపోతే అవకాశాలను కోల్పోవచ్చు. సూర్య ఆరాధన చేస్తే మంచిది.
మనస్సౌఖ్యం ఉంటుంది. ఆత్మీయుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.