Horoscope Today : ఈ రోజు(ఆగస్టు 30) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే.
సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.
ప్రయత్నకార్య సిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది.
ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధిక శ్రమ చేయాలి. ఎవ్వరితోనూ వాగ్వాదాలు చేయకండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. గోసేవ చేస్తే మంచిది.
సమాజంలో మీ విలువ పెరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్టకం చదవితే మంచిది.
శుభఫలితాలు పొందుతారు. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
మంచి ఫలితాలున్నాయి. బంధువుల సహకారము అందుతుంది. ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. ఇష్టదేవతారాధన శుభప్రదం.
మిశ్రమకాలం. స్థిరచిత్తంతో పనిచేయాలి. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగించడంతోపాటు మానసికంగా ఇబ్బంది పెడతాయి. లింగాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
పట్టుదలతో పనిచేయండి. గొప్ప లాభాలున్నాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. గణపతి ధ్యానం శుభప్రదం.
మిశ్రమకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. కొందరు మీ ఉత్సాహాన్ని భంగం చేయాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.
ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. మీ ప్రమేయం లేకుండా నింద పడాల్సి వస్తుంది. కలహ సూచన ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన మంచిది.
ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం ఉంది. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.