Horoscope Today (26-07-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
![](https://assets.eenadu.net/article_img/mesham_2.jpg)
మీ మీ రంగాల్లో ఫలితాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన మంచిది.
![](https://assets.eenadu.net/article_img/vrushabam.jpg)
ఉత్సాహంగా పనిచేయాల్సిన సమయమిది. కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు.వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి.
![](https://assets.eenadu.net/article_img/midhunam.jpg)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.
![](https://assets.eenadu.net/article_img/karkatakam_2.jpg)
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచీచెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారంలో ముందుచూపు అవసరం. దైవబలం రక్షిస్తోంది. విష్ణు సందర్శనం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/simham_1.jpg)
ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. గణపతి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.
![](https://assets.eenadu.net/article_img/kanya_1.jpg)
చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో మాత్రం అంటీముట్టనట్టు ఉండటమే మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/tula_1.jpg)
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదివితే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/vruschikam.jpg)
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
![](https://assets.eenadu.net/article_img/dhanussu.jpg)
శుభ ఫలితాలు కలవు. కొత్త పనులను ప్రారంభిస్తారు.పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం. ఇష్టదేవతను ఆరాధిస్తే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/makaram_3.jpg)
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/kumbam_1.jpg)
ప్రారంభించిన కార్యక్రమాలు నలుగురికీ ఆదర్శప్రాయంగా ఉంటాయి. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/meenam_2.jpg)
బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. చంద్రధ్యానం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.