మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. చంచలబుద్ధితో ఇబ్బంది పడతారు. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్య వ్యవహారాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. దుర్గా దర్శనం మేలు చేస్తుంది.
అవసరానికి ఆదుకునేవారు ఉన్నారు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. మీ అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటుచేసుకుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
మిశ్రమకాలం. లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని జయించాలి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. గణపతి సహస్రనామ పారాయణం శుభకరం.
గొప్ప శుభకాలం. అదృష్టవంతులు అవుతారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్ధికంగా సానుకూలిస్తుంది. నూతన వస్తువులను కొంటారు.కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీవిష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
విజయసిద్ధి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబం అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో శుభకాలం. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీవిష్ణు ఆరాధన మంచిది.
చేపట్టే పనుల్లో సులువైన మార్గాన్ని కనుగొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
చేపట్టిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు లేదా సొంతింటి నిర్మాణ వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. కులదైవ సందర్శనం శుభకరం.
మానసికంగా ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మనఃస్సౌఖ్యం ఉంటుంది. కాలం శుభప్రదంగా గడుస్తుంది. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచిది.
విశేషమైన శుభయోగాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మానసిక శక్తిని ఇస్తుంది. ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం.