ETV Bharat / bharat

Horoscope Today (24-10-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - రాశిఫలాలు

Horoscope Today(24-10-2021): ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope today
రాశి ఫలాలు
author img

By

Published : Oct 24, 2021, 5:27 AM IST

ఈరోజు (24-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం

బహుళపక్షం చవితి: రా. 2.21 తదుపరి పంచమి రోహిణి: రా. 11.07 తదుపరి మృగశిర

వర్జ్యం: మ. 2.15 నుంచి 4.01 వరకు తిరిగి తె.వ. 5.19 నుంచి

అమృత ఘడియలు: రా.7.34 నుంచి 9.20 వరకు

దుర్ముహూర్తం: సా. 3.58 నుంచి 4.44 వరకు

రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు

సూర్యోదయం: ఉ.5-59, సూర్యాస్తమయం: సా.5-31 సంకట హర చతుర్థి

మేషం

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. సాయి చరిత్ర పారాయణ మంచిది.

వృషభం

ప్రారంభించే పనుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. లక్ష్యసాధనలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది.

మిథునం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. హుషారుగా పని చేయాలి. అధికారులతో అతి చనువు వద్దు. అందరినీ సమభావంతో చూడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

కర్కాటకం

సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఇష్టదైవారాధన శుభప్రదం.

సింహం

అనుకూల సమయం. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

కన్య

పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

తుల

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. ముఖ్య విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. ఎవరినీ అతిగా నమ్మకండి. శనికి తైలాభిషేకం శుభప్రదం.

వృశ్చికం

ప్రయత్నకార్య సిద్ది కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు,వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభాన్ని చేకూరుస్తుంది.

ధనుస్సు

మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. తోటివారి సహకారంతో సత్పలితాలను సాధిస్తారు. లక్ష్మీనామాన్ని జపించడం ఉత్తమం.

మకరం

మీ చిత్తశుద్దే విజయానికి మూలం అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విఘ్నాల్ని కలిగించేవారు పక్కనే ఉంటారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

కుంభం

ఆత్మబలంతో ఒక పనిలో చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

మీనం

ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. బుద్ధిబలంతో సమస్యలు తొలుగుతాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యలతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (అక్టోబరు 24 - అక్టోబరు 30)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.