ఈరోజు (22-10-2021) గ్రహబలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
- శ్రీ ప్లవనామ సంవత్సరం- దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం; బహుళపక్షం.
- విదియ: రా.10.17 తదుపరి తదియ.
- భరణి: సా. 6.05 తదుపరి కృత్తిక.
- వర్జ్యం: లేదు.
- అమృత ఘడియలు: మ.12.51 నుంచి 2.35 వరకు
- దుర్ముహూర్తం: ఉ. 8.16 నుంచి 9.03 వరకు తిరిగి మ. 12.08 నుంచి 12.54 వరకు
- రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
- సూర్యోదయం: ఉ.5-58, సూర్యాస్తమయం: సా.5-32.
- అశూన్య శయన వ్రతం
మేషం..
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు గుర్తింపు దక్కుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
వృషభం..
శ్రమకు తగిన ఫలితాలు ఉన్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.
మిథునం..
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. హనుమాన్ చాలీసా జపించడం మంచిది.
కర్కాటకం..
ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈశ్వర దర్శనం శుభప్రదం.
సింహం..
ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన దాని కన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.
కన్య..
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆపదలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్ట దేవతా స్తుతి శుభప్రదం.
తుల..
మంచి ఫలితాలు ఉన్నాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. లక్ష్మీగణపతి ధ్యానం శుభప్రదం.
వృశ్చికం..
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.
ధనస్సు..
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.
మకరం..
మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఈశ్వరుని ఆరాధిస్తే మంచిది.
కుంభం..
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడిని పెంచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవాలి.
మీనం..
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర, ధాన్య లాభాలు ఉన్నాయి.