ఈరోజు (21-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
- శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజ మాసం
- బహుళపక్షం పాడ్యమి: రా. 8.37 తదుపరి విదియ
- అశ్విని: మ.3.56 తదుపరి భరణి
- వర్జ్యం: ఉ. 11.38 నుంచి 1.21 వరకు తిరిగి రా. 2.23 నుంచి 4.07 వరకు
- అమృత ఘడియలు: ఉ. 8.12 నుంచి 9.55 వరకు
- దుర్ముహూర్తం: ఉ. 9.49 నుంచి 10.35 వరకు తిరిగి మ. 2.27 నుంచి 3.13 వరకు
- రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
- సూర్యోదయం: ఉ.5-57, సూర్యాస్తమయం: సా.5-33
నేటి రాశి ఫలాలు..
మేషం..
చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభాలను చేకూరుస్తుంది.
వృషభం..
మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
మిథునం..
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.
కర్కాటకం..
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. రామనామ జపం శ్రేయోదాయకం.
సింహం..
సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
కన్య..
ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. లింగాష్టకాన్ని పఠిస్తే బాగుంటుంది.
తుల..
ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
వృశ్చికం..
మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని పోవడం ఉత్తమం. శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు.
ధనస్సు..
మిశ్రమ కాలం. ముఖ్య పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవిని, శ్రీవెంకటేశ్వరుని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
మకరం..
ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠిస్తే బాగుంటుంది.
కుంభం..
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్త. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శనిజపం అనుకూలతనిస్తుంది.
మీనం..
గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.