ETV Bharat / bharat

Horoscope Today (25-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - రాశి ఫలం

ఈ రోజు రాశిఫలాలు (Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
Horoscope Today (25-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..
author img

By

Published : Nov 25, 2021, 4:28 AM IST

ఈరోజు (25-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు; కార్తిక మాసం;బహుళపక్షం

షష్ఠి: రా.11.39 తదుపరి సప్తమి

పుష్యమి: మ. 3.13 తదుపరి ఆశ్లేష

వర్జ్యం: తె. 4.43 నుంచి

అమృత ఘడియలు: ఉ.8.21 నుంచి 10.04 వరకు

దుర్ముహూర్తం: ఉ. 9.55 నుంచి 10.39 వరకు తిరిగి మ. 2.22 నుంచి 3.06 వరకు

రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు

సూర్యోదయం: ఉ.6.13, సూర్యాస్తమయం: సా.5-20

మేషం

ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

వృషభం

బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

మిథునం

ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. అర్థలాభం సూచితం. సమయానికి నిద్రాహారాలు అవసరం. దుర్గాస్తుతి వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

కర్కాటకం

శరీర సౌఖ్యం ఉంది. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మీరు ఒకటి అంటే మరొకటి అర్ధం చేసుకుంటారు. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.

సింహం

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. చంద్ర ధ్యానం శుభప్రదం.

కన్య

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

తుల

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. గణనాయకాష్టకం పఠిస్తే మంచిది.

వృశ్చికం

ప్రారంభిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంకటహర గణపతి స్తోత్రం పఠించడం
శుభకరం.

ధనుస్సు

అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రుల సలహాలు సూచనలు పాటించడం మేలు. బద్దకం వల్ల ఇబ్బందులు అధికం అవుతాయి. దుర్గారాధన చేస్తే మంచిది

మకరం

మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.

కుంభం

వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికి శ్రీ వేంకటేశ్వరుణ్ణి పూజించాలి.

మీనం

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం మీకు తోడ్పడతాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముందుజాగ్రత్త లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

ఇదీ చూడండి : ఆ కుటుంబం లక్ బాగుంది.. ఇల్లు కూలడానికి క్షణాల ముందే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.