ETV Bharat / bharat

Horoscope Today (21-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - Today Horoscope

ఈ రోజు రాశిఫలాలు(Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
ఈ రోజు రాశిఫలాలు
author img

By

Published : Nov 21, 2021, 4:31 AM IST

ఈరోజు(21-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;బహుళపక్షం

విదియ: సా. 5.04 తదుపరి తదియ

రోహిణి: ఉ. 6.16 తదుపరి మృగశిర

వర్జ్యం: మ. 12.28 నుంచి 2.14 వరకు

అమృత ఘడియలు: రా.11.07 నుంచి 12.53 వరకు

దుర్ముహూర్తం: సా. 3.50 నుంచి 4.35 వరకు

రాహుకాలం: మ. 4.30 నుంచి 6.00 వరకు

సూర్యోదయం: ఉ.6.12, సూర్యాస్తమయం: సా.5-20

సింధూనది పుష్కరారంభం

మేషం

అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

వృషభం

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

మిథునం

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. ధర్మసిద్ధి ఉంది. వృథా ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమ చేయాలి. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

సింహం

మీ మీ రంగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభాన్నిస్తుంది.

కన్య

కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది.

తుల

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ మంచిచేస్తుంది.

వృశ్చికం

ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

ధనుస్సు

ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. నూతన వస్తువులు కొంటారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్నినింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శనిధ్యానం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

మకరం

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మహా గణపతి ఆరాధన శుభప్రదం.

కుంభం

ప్రారంభించిన పనిలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. శివ నామస్మరణతో పనుల్లో ఆటంకాలు తొలగి, ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి.

మీనం

కీలక నిర్ణయాలను అమలు చేసే ముందు బాగా అలోచించి ముందు సాగాలి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మీ గణపతి దర్శనం శక్తిని ఇస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.