ఈరోజు(20-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం బహుళపక్ష
పాడ్యమి: మ.2.56 తదుపరి విదియ
వర్జ్యం: రా. 9.24 నుంచి 11.10 వరకు
అమృత ఘడియలు: రా.2.42 నుంచి 4.28 వరకు
దుర్ముహూర్తం: ఉ. 6.11 నుంచి 7.40 వరకు
రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు
సూర్యోదయం: ఉ.6.11,
సూర్యాస్తమయం: సా.5-20
మేషం
శారీరక శ్రమ అధికం అవుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. సమయాన్ని వృథా చేయకండి. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
వృషభం
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అధికారుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.
మిథునం
వృత్తి, ఉద్యోగాల్లో, శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. భయాందోళనలు విడనాడాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
కర్కాటకం
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. గణపతిని ఆరాధించడం మంచిది.
సింహం
మీలోని నైపుణ్యంతో గొప్ప పేరు సంపాదిస్తారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్థలాభం ఉంది. ఈశ్వర దర్శనం మంచిది.
కన్య
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
తుల
మిశ్రమకాలం. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దేహజాఢ్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.
వృశ్చికం
ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి ఉంది. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణసమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని చేకూరుస్తుంది.
ధనుస్సు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శివనామాన్ని జపించండి.
మకరం
ప్రారంభించే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. దైవారాధన మానవద్దు.
కుంభం
ప్రారంభించబోయే పనుల్లో రెండు ఆలోచనలతో వెళ్లకండి. గిట్టని వారికి దూరంగా ఉండాలి. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ఇష్టదైవాన్ని పూజించాలి.
మీనం
శరీరసౌఖ్యం కలదు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.