ఈరోజు(13-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తిక మాసం
శుక్లపక్షం నవమి: ఉ. 9.22 తదుపరి దశమి
శతభిషం: రా. 7.35 తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా. 2.01 నుంచి 3.38 వరకు
అమృత ఘడియలు: మ.12.28 నుంచి 2.03 వరకు
దుర్ముహూర్తం: ఉ. 6.07 నుంచి 7.36 వరకు
రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు
సూర్యోదయం: ఉ.6.07, సూర్యాస్తమయం: సా.5-21
మేషం
మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. కీలక విషయాల్లో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. శివపార్వతులను పూజించడం మంచిది.
వృషభం
శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.
మిథునం
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. కలహాలకు తావివ్వకండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం పఠించడం మంచిది.
కర్కాటకం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కార్యసిద్ధి ఉంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో దేహజాఢ్యాన్ని రానీయకండి. దుర్గారాధన మేలు చేస్తుంది.
సింహం
శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
కన్య
మనః స్సౌఖ్యం ఉంది. ఉద్యోగులకు శుభకాలం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
తుల
బాధ్యతలు పెరుగుతాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
వృశ్చికం
ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువ శ్రమించాలి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
ధనస్సు
శుభకాలం. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
మకరం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అలసట పెరుగుతుంది. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
కుంభం
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
మీనం
ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఇష్టదేవతా శ్లోకం చదవాలి.