ETV Bharat / bharat

Horoscope Today (14-03-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - గ్రహం అనుగ్రహం

Horoscope Today (14-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు
author img

By

Published : Mar 14, 2022, 4:35 AM IST

Horoscope Today (14-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు;

ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం

ఏకాదశి: ఉ. 10.31 తదుపరి ద్వాదశి

పుష్యమి: రా. 8.53 తదుపరి ఆశ్లేష

వర్జ్యం: లేదు అమృత ఘడియలు: మ.1.54 నుంచి 3.39 వరకు

దుర్ముహూర్తం: మ.12.33 నుంచి 1.21 వరకు తిరిగి 2.56 నుంచి 3.43 వరకు

రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.6.14, సూర్యాస్తమయం: సా.6.06

మతత్రయ ఏకాదశి, మీన సంక్రమణం

మేషం

కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య విషయాల్లో బద్దకించకండి. ఆరోగ్యం జాగ్రత్త. దుర్గ ఆరాధన శుభప్రదం.

వృషభం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. శని ఆరాధన శుభప్రదం.

మిథునం

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

కర్కాటకం

కీలక నిర్ణయాలను అమలు చేసేముందు బాగా అలోచించి ముందుకు సాగాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీగణపతి సందర్శనం శక్తినిస్తుంది.

సింహం

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభ వార్త ఆనందాన్నిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్య

కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదివితే మంచి జరుగుతుంది.

తుల

తలపెట్టిన పనుల్లో జాప్యం వద్దు. వృత్తి, ఉద్యోగ, రంగాలలో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. మనపక్కనే ఉండి ఇబ్బందిపెట్టేవారున్నారు. చంద్రధ్యాన శ్లోకం చదవడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

వృశ్చికం

బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వరుణ్ణి పూజించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు.

ధనస్సు

మంచిఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.

మకరం

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్నిస్తాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. దేహసౌఖ్యం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభం

ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. అస్థిర నిర్ణయాలతో ఏ పనులు మొదలు పెట్టకండి. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదేవత స్తోత్ర పారాయణం చేస్తే మంచిది.

మీనం

వృత్తి, ఉద్యోగాల్లో సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మానసిక ప్రశాంతత చూసుకోవాలి. అందరిని కలుపుకొని పోవడం ఉత్తమం. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.