Horoscope Today (23-02-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
మేషం
శుభ సమయం. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.
వృషభం
పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఇబ్బందులు కలుగుతాయి. శివారాధన శుభదాయకం.
మిథునం
అనుకున్నది సాధించేవరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత పనులను ప్రారంభిస్తే మంచిది. ఇష్టదైవారాధన ఉత్తమం.
కర్కాటకం
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. అవసరానికి తగినట్టు ముందుకుసాగడం మేలు. శివారాధన శుభాన్నిస్తుంది.
సింహం
మీ మీ రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైనవారితో కాలక్షేపం చేస్తారు. కీలక సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయవద్దు. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం.
కన్య
మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సాయిబాబా సచ్ఛరిత్ర పారాయణ శుభాన్నిస్తుంది.
తుల
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దత్తాత్రేయుడిని ఆరాధిస్తే మంచిది.
వృశ్చికం
మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్నిస్తాయి. అధికారులు మీకు అనుకూలంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. ఉమామహేశ్వర స్తోత్రం పఠిస్తే శుభం కలుగుతుంది.
ధనస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.
మకరం
కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలున్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. ఈశ్వర ధ్యానం శుభప్రదం.
కుంభం
మధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలున్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.
మీనం
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య పనులను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం శుభదాయకం.
ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఫిబ్రవరి 20 - ఫిబ్రవరి 26)