ETV Bharat / bharat

Horoscope Today (18-02-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - తెలుగు జాతకం

Horoscope Today (18-02-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

రాశిఫలాలు
Horoscope Today
author img

By

Published : Feb 18, 2022, 4:32 AM IST

Horoscope Today (18-02-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు;

మాఘ మాసం; బహుళ పక్షం

విదియ: రా. 10.39 తదుపరి తదియ;

పుబ్బ: సా. 5.06 తదుపరి ఉత్తర;

వర్జ్యం: రా. 12.21 నుంచి 1.58 వరకు;

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.09 వరకు;

దుర్ముహూర్తం: ఉ. 8.46 నుంచి 9.32 వరకు; తిరిగి మ.12.36 నుంచి 1.22 వరకు;

రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు;

సూర్యోదయం: ఉ.6.29, సూర్యాస్తమయం: సా.5.58

మేషం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆపదలు తొలగుతాయి. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అష్టలక్ష్మీ స్తోత్రం చదివితే మంచిది.

వృషభం

ఇప్పటికే ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. లక్ష్మీస్తుతి చదవడం శుభప్రదం.

మిథునం

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

కర్కాటకం

ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్య ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

సింహం

ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

కన్య

మీ మీ రంగాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో వైరసూచన. మనస్తాపం, శ్రమ పెరుగుతుంది. గణపతి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు.

తుల

చిరస్మరణీయ విజయాలు సొంతం అవుతాయి. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గా ధ్యానశ్లోకం చదవండి.

వృశ్చికం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మేలు చేకూరుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

ధనస్సు

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. చంద్రధ్యానం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

మకరం

ప్రారంభించబోయే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

కుంభం

మీ మీ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మీనం

శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్దిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఫిబ్రవరి 13 - 20)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.