Horoscope Today (15-02-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు;
మాఘ మాసం; శుక్ల పక్షం
చతుర్దశి: రా. 9.15 తదుపరి పూర్ణిమ;
పుష్యమి: మ. 1.37 తదుపరి ఆశ్లేష;
వర్జ్యం: తె.వ. 3.18 నుంచి 5.00 వరకు;
అమృత ఘడియలు: ఉ.6.40 నుంచి 8.24 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8.48 నుంచి 9.33 వరకు; తిరిగి రా. 10.58 నుంచి 11.48 వరకు;
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6.31, సూర్యాస్తమయం: సా.5.57
మేషం
మంచి ఆలోచనలతో చేసే పనులు త్వరగా నెరవేరుతాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
వృషభం
ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
మిథునం
ఇప్పటికే ప్రారంభించిన పనులలో ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ది కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివారాధన వల్ల అంతా మంచి జరుగుతుంది.
కర్కాటకం
శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. విష్ణు ఆరాధన శుభప్రదం.
సింహం
ఉత్సాహవంతంగా కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
కన్య
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
తుల
దైవబలం విశేషంగా రక్షిస్తోంది. ఆర్ధికంగా అనుకూల సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందూ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.
వృశ్చికం
ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం.
ధనుస్సు
ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. గతం కన్నా మంచి సమయం. బంధు ప్రీతి కలదు. స్థిరాస్తి కి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం.
మకరం
మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గొప్ప ఆలోచనావిధానంతో అభివృద్ది సాధిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.
కుంభం
ఒక శుభవార్త వింటారు. ఆర్ధికంగా లాభదాయకమైన కాలం. అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో పరిస్థితులు తారుమారు కాకుండా ముందు జాగ్రత్త పడటం మంచిది. అష్టలక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.
మీనం
ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి.