ఆగస్టు 8వ తేదీన ఈ మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఒక సంఘటన కనువిప్పు కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే బాగుంటుంది.
వృషభం
సమాజంలో గౌరవం పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టమైన కాలాన్ని గడుపుతారు. ఆర్ధికంగా పొదుపు సూత్రాన్ని పాటించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
మిథునం
ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం కలదు. కీలక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శివ నామస్మరణ చేస్తే బాగుంటుంది.
కర్కాటకం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. బంధుప్రీతి ఉంది. లక్ష్మీ అష్టోత్తరం చదివితే బాగుంటుంది.
సింహం
మీ మనోధైర్యమే మీ విజయానికి మూలం. చేపట్టే పనులు సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య
తోటివారి సహకారంతో పనులను ప్రారంభించండి. మంచిఫలితాలు సాధిస్తారు. అలసట పెరగకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే అన్నివిధాలా బాగుంటుంది.
తుల
సంపూర్ణ మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. తోటివారిని కలుపుకొని పోవడం వల్ల మంచి జరుగుతుంది. ముఖ్య వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకోండి. ఇష్టదైవారాధన వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
అనుకూల సమయం కాదు. అధికారులతో జాగ్రత్త. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. సమయానికి నిద్రాహారాలు అవసరం. నవగ్రహ శ్లోకాలను చదువుకోవాలి.
ధనుస్సు
మిశ్రమ కాలం. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గాదేవి, వెంకటేశ్వరుని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
మకరం
ఉద్యోగంలో శ్రమ ఫలిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. లింగాష్టకం పఠిస్తే బాగుంటుంది.
కుంభం
కుటుంబ సభ్యుల సలహాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించండి. అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్థిరమైన ఆలోచనలు మేలు చేస్తాయి. గణపతి అష్టోత్తరం పఠిస్తే బాగుంటుంది.
మీనం
మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. లక్ష్మీ ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.
ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఆగస్టు 8 - 14)