Horoscope Today 27th October 2023 : అక్టోబర్ 27న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మానసికంగా, శారీరకంగా కాస్త ఇబ్బంది పడతారు. అధికంగా ఖర్చులు చేసే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. దానధర్మాలు చేయకపోవడం మంచిది. లేదంటే నష్టపోయే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి.
వృషభం (Taurus) : ఈ రోజు మీ ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు తలపెట్టిన పనులను మధ్యలోనే వదిలేస్తారు. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించండి. లేదంటే ఆర్థికంగా ఇబ్బంది పడతారు. కష్టపడి పనిచేయండి ఫలితం దక్కుతుంది. ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి. జాగ్రత్తగా ఉండండి.
మిథునం (Gemini) : మీ సన్నిహితులతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ రోజు మీరు ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలకు తగిన ప్రశంసలు, బహుమతులను పొందుతారు. మీ భవిష్యత్ గురించి ఈ రోజు మీరు ఆలోచన చేస్తారు. ఇది మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుంది.
కర్కాటకం (Cancer) : మీ మంచి కోరే శ్రేయోభిలాషుల వల్ల ఈ రోజు మీకు అదృష్టం కలిసివస్తుంది. చిన్నపాటి విహారయాత్రి లేదా తీర్థయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ ట్రిప్ మిమ్మల్ని ఆనందానికి గురిచేస్తుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీ స్నేహితులు లేదా ప్రియమైన వారితో సంతోషంగా గడపవచ్చు.
సింహం (Leo) : ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు శ్రద్ధ వహించాలి. వైద్యానికి ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు బయటి భోజనం తినకుండా ఉంటే మంచిది. కొన్ని ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని రోజంతా ఇబ్బంది పెట్టవచ్చు. వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ధ్యానం చేయండి. ఈ రెండు మిమ్మల్ని సమస్యలను అధిగమించి మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.
కన్య (Virgo) : కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ప్రారంభించకపోవడం ఉత్తమం. మీ కోపాన్ని నియంత్రణలో పెట్టుకోండి. ఇది కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదురవ్వకుండా చేస్తుంది. మీ కుటుంబ సభ్యులతో జరిపే ఓ సంభాషణ మీకు బాధ కలిగిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నాయి జాగ్రత్త.
తుల (Libra) : ఈ రోజు మీరు మొత్తం పనిలోనే నిమగ్నమై ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా మిమ్నల్ని మీకు మార్చుకునేందుకు ప్రయత్నించండి. షాపింగ్‌లకు ఖర్చు చేస్తారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారి. దీంతో మీ చుట్టూ ప్రకాశవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీకు నచ్చిన ఆహారాన్ని ఈ రోజు మీరు భుజిస్తారు.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు ఆరోగ్యంగా మీకు బ్రాహ్మాండంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. బాధలో ఉన్నవారిని ఉత్సాహపరచడానికి ఈ రోజు మంచి సమయం. మీ సహచరుల నుంచి సహకారం, మద్దతు లభించవచ్చు. మీ ప్రత్యర్థులను ఓడించి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు (Sagittarius) : ఆరోగ్యం ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ పిల్లలకు సంబంధించి చదువులు, ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు. వీటి పట్ల ఈ రోజు మీరు ఆందోళన చెందుతారు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మేధోపరమైన చర్చలకు దూరంగా ఉంటే మంచిది. కళలు, సాహిత్యంపై ఎక్కువ శ్రద్ధ పెడతారు.
మకరం (Capricorn) : కుటుంబంలోని గొడవల కారణంగా శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడవచ్చు. మీ కీర్తి, ప్రతిష్ఠలను దెబ్బతీసే కొన్ని సంఘటనలు ఈ రోజు జరగవచ్చు. జాగ్రత్త. ఈ రోజు కొంత చికాకుకు లోనవుతారు.
కుంభం (Aquarius) : ఈ రోజు మీకు అదృష్టం కలిసివస్తుంది. ఆందోళనలకు దూరంగా ఉంటే మంచిది. స్నేహితులు, తోబుట్టువులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. ఒక చిన్నపాటి ట్రిప్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మీలో ఆనందాన్ని సృష్టిస్తాయి. మీ పోటీదారులను ఓడించి విజయాన్ని సాధిస్తారు.
మీనం (Pisces) : సహనాన్ని పాటించండి. మీ మాటలను, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. లేదంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగండి. వాదనలకు దూరంగా ఉండండి. అర్థరహిత ఆలోచనలు చేయకండి. ఇవి మీకు మరింత హాని చేస్తాయి.