Horoscope Today 24th August 2023 In Telugu : ఆగస్టు 24న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : దూకుడుగా తీసుకున్న ఓ నిర్ణయం ఏళ్ల తరబడి మీరు పడుతున్న కష్టాన్ని పోగొడుతుంది. రోజంతా ఒత్తిడిలో గడిపినా.. కాసేపు పిల్లలతో సరదాగా గడుపుతారు. పిల్లల పనుల్లో పాలుపంచుకుంటారు.
వృషభం (Taurus) : ఈ రోజు అనుకూలంగా ఉంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో మంచిపేరు లభిస్తుంది. విదేశాల నుంచి శుభవార్త వింటారు. వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. మీకు అనుకోకుండా ధనసంపదలు కలిసి వస్తాయి.
మిథునం (Gemini) : చాలా పనులను ఈ రోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచిపేరు సంపాదిస్తారు. ఇంట్లోని వాతావరణం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బలపడతారు. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. పని ప్రదేశంలో సహచరుల నుంచి సహకారం అందుతుంది. పట్టుదలతో మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కాస్త ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మానసికంగా కలవరపాటుకు గురవుతారు. ఒత్తిడికి గురిచేసే పనులు చేయకుండా ఉంటే మంచిది. ఖర్చులు ఉన్నాయి. వాదనలకు దూరంగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
సింహం (Leo) : ఈ రోజు కాస్త జాగ్రత్తగా మెలగండి. మీరు వేసే ప్రతి అడుగును పరిశీలించుకోవాలి. మీ అమ్మగారి తరఫున సంబంధాల విషయంలో అనుబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఉద్రేకం, వాదనలు, నెగిటివిటీకి దూరంగా ఉండండి. ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే పూర్తి చేయండి. డాక్యుమెంట్ల విషయంలో, నీటితో జాగ్రత్త.
కన్య (Virgo) : భాగస్వామ్య ప్రాజెక్టులకు ఈ రోజు మీరు దూరంగా ఉండటం మంచిది. ఒంటరిగానే మీరు పోటీని ఎదుర్కోగలరు. పనిపరంగా మీరు మంచి పరిపాలనా దక్షులు. మీ నమ్మకాన్ని దెబ్బతీసే పనులేవి ఈ రోజు మీరు చేపట్టకుండా ఉండటం ఉత్తమం.
తుల (Libra) : ఇతరులు చెప్పే మాటలు వినొద్దు. పైగా వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్రం చేస్తారు. మీ చుట్టుపక్కల జరిగే ప్రతి విషయాన్ని చూసి మీరు ఈ రోజు ఆశ్చర్యపోతారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ.. మీ ఆలోచనలను సరిదిద్దుకోండి.
వృశ్చికం (Scorpio) : ప్రేమ, అంతులేని ఉత్సాహం అనేవి మీ జీవనశైలి. ఈ రెండింటిని ఈ రోజు మీరు బాగా ప్రదర్శిస్తారు. అయితే వీటికి పరిమితులు విధించుకొని వ్యవహరించండి.
ధనుస్సు (Sagittarius) : సమర్థమైన మాటతీరు లేకపోవడం వల్ల మీరు ఈ రోజు చాలా ఇబ్బందుల్లో పడతారు. మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. లేదంటే వాదనలు, సంజాయిషీలతోనే మీ ఈ రోజంతా గడుస్తుంది. మీకు వచ్చే సమస్యలు ఊహకు కూడా అందనివి. ఆరోగ్యం కూడా కలవరపెడుతుంది.
మకరం (Capricorn) : ఈ రోజు మంచి రోజు. మీ బంధువులను, స్నేహితులందరినీ ఈ రోజు కలుసుకోవచ్చు. జీవిత భాగస్వామి కోసం అన్వేషిస్తున్న వారికి ఈ రోజు శుభప్రదమైన రోజు. స్నేహితుల నుంచి బహుమతులు పొందుతారు. ప్రయాణ సమయాల్లో మీ వ్యాపారం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా.
కుంభం (Aquarius) : ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. పనులు సులభంగా సమయంలోపే పూర్తిచేస్తారు. కుటుంబంలో, పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారులు, వృత్తినిపుణులు ఒక పెద్ద ఆశ్చార్యకర ఘటననను ఈ రోజు చూస్తారు. పొత్తులు, భాగస్వామ్యాలు అదృష్టకరంగా ఉంటాయి. పెద్ద విజయం సాధిస్తారు.
మీనం (Pisces) : మీ రోజువారీ పనుల నుంచి కొంత విశ్రాంతిని కోరుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. మీ ప్రస్తుత ప్రాజెక్టులపై మీరు వెచ్చించిన సమయం ఆధారంగా కొంత బ్రేక్ తీసుకోవడం మంచిది.