Horoscope Today (09-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

ముఖ్య వ్యవహారాలలో గొప్ప లాభాలు పొందుతారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. సాయిబాబా దర్శనం శుభప్రదం.

మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

అవసరానికి తగిన సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. గోవింద నామాలు చదవటం మంచిది.

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

ఇప్పటికే ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటి వారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన మానవద్దు.

చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శనిధ్యానం శుభప్రదం.

శుభకాలం.ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యవిషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది.