ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
గ్రహబలం శ్రీ ప్లవ నామ సంవత్సరం..
- దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; శుక్లపక్షం ఏకాదశి: ఉ. 8.33, ద్వాదశి శ్రవణం: తె.4.50
- ధనిష్ఠ వర్జ్యం: ఉ 9.34 నుంచి 11.06 వరకు
- అమృత ఘడియలు: రా. 6.48 నుంచి 8.21 వరకు
- దుర్ముహూర్తం: ఉ. 8.16 నుంచి 9.05 వరకు తిరిగి మ. 12.19 నుంచి 1.08 వరకు
- రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
- సూర్యోదయం: ఉ.5-51,
- సూర్యాస్తమయం: సా.6-00 విష్ణు పరివర్తనైకాదశి, శ్రీ వామన జయంతి
మేషం..
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
వృషభం..
కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ఇష్టదైవ ప్రార్థన మంచిది.
మిథునం..
కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శివనామస్మరణ శుభప్రదం.
కర్కాటకం..
బుద్ధిబలంతో కొన్ని వ్యవహారాలలో సమస్యలను అధిగమించగలుగుతారు. మనస్సౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే ఘటనలు చోటుచేసుకుంటాయి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.
సింహం..
ధర్మసిద్ధి కలదు. బుద్దిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్ట దైవ దర్శనం శుభప్రదం.
కన్య..
అధికారుల సాయంతో ఒక పని పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థికసాయం అందుతుంది. బంధుప్రీతి ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
తుల..
శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.
వృశ్చికం..
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్నీ కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
ధనస్సు..
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
మకరం..
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
కుభం..
చేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
మీనం..
పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
ఇవీ చదవండి: