ETV Bharat / bharat

July 9 Horoscope: నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - కుంభం

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు
author img

By

Published : Jul 9, 2021, 4:00 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం

ఒక మంచివార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. దైవారాధన మానవద్దు.

వృషభం

అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

మిథునం

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. జన్మరాశిలో చంద్రసంచారం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం పఠించాలి.

కర్కాటకం

శ్రమతో కూడిన సత్ఫలితాలు సాధిస్తారు. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆపదలు పెరుగుతాయి. ద్వాదశ చంద్రబలం అనుకూలంగా లేదు. మనోబలం పెరగడానికి లక్ష్మీస్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

సింహం

మనఃసౌఖ్యం ఉంది. కృషి,పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇష్టదేవతా ధ్యానం మేలు చేస్తుంది.

కన్య

కీలకమైన చర్చలు ఫలిస్తాయి. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధు,మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

తుల

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. చంచలబుద్ధితో ఇబ్బంది పడతారు. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

వృశ్చికం

ఆత్మస్థైర్యంతో అనుకున్నది సాధిస్తారు. అష్టమ చంద్ర సంచారం అనుకూలించట్లేదు. విరోధాలకు దూరంగా ఉండాలి. మనశ్శాంతి కరువవకుండా చూసుకోవాలి. శివారాధన శుభప్రదం.

ధనుస్సు

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.

మకరం

ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ప్రశాంతమైన చిత్తంతో ముందుకు సాగండి.. మంచి జరుగుతుంది. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచిది.

కుంభం

ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. దుర్గాశ్లోకాన్ని పఠిస్తే అన్ని విధాలా మంచిది.

మీనం

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధు,మిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.