నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..
మేషం
మీ పనుల్లో బంధు,మిత్రులు సాయపడతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
వృషభం
శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.
మిథునం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయం పఠించాలి.
కర్కాటకం
మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. చంద్రధ్యానం, దుర్గారాధన మేలైన ఫలితాన్ని ఇస్తుంది.
సింహం
మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన సమయంలో సహాయం అందుతుంది. బాధ్యతలను గుర్తెరిగి పనిచేయండి. చక్కటి శుభఫలితాలను పొందుతారు. శ్రీవిష్ణు దర్శనం ఉత్తమం.
కన్య
లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
తుల
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో తరచూ నిర్ణయాలు మార్చి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.
వృశ్చికం
చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గారాధన శుభప్రదం.
ధనుస్సు
మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
మకరం
ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మంచిది.
కుంభం
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
మీనం
ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ముఖ్య విషయాలను మధ్యాహ్నం తర్వాత చేయడం మంచిది. ఇష్ట దైవారాధన శుభప్రదం.