ETV Bharat / bharat

ఇంట్లోంచి లాక్కొచ్చి ప్రేమికులపై తూటాల వర్షం.. పరువు పేరుతో... - ఉత్తర్​ప్రదేశ్​

Honor killing: ప్రేమికులను ఇంట్లోంచి లాక్కొచ్చి వారిపై తూటాల వర్షం కురిపించారు యువతి కుటుంబ సభ్యులు. ఆపై యువకుడి తలపై ఇటుకరాయితో దాడి చేసి, పరారయ్యారు. ఈ దాడిలో ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరువు హత్య ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​ జిల్లాలో మంగళవారం జరిగింది.

Honor killing
ప్రేమికులపై తూటాల వర్షం
author img

By

Published : Feb 23, 2022, 1:44 PM IST

Honor killing: ఓ యువతి ప్రేమను జీర్ణించుకోలేకపోయిన ఆమె కుటుంబ సభ్యులు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. యువతితో పాటు ఆమె ప్రేమికుడిని ఇంట్లోంచి లాక్కొచ్చి ఇరువురిపై తూటాల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా యువకుడి తలపై ఇటుకరాయితో దాడి చేసి పారిపోయారు. ఈ పరువు హత్య​ ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్ జిల్లాలో మంగళవారం జరిగింది.

ఇదీ జరిగింది..

జిల్లాలోని జలాలాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కకరాహ్​ గ్రామానికి చెందిన సోనూ అనే యువకుడు తన పొరుగింటిలో ఉండే యువతి ప్రీతిని ప్రేమించాడు. ఇరువురి ప్రేమ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాట వినకపోవటం వల్ల ఇద్దరినీ చంపేయాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం సాయంత్రం సోనూ.. ప్రీతి ఇంటికి వచ్చిన క్రమంలో ఆమె సోదరులు రాజీవ్​, సుశీల్​, ములాయం, నర్సింగ్​.. ఇరువురిని ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చారు.

Honor killing
సోనూ

ఇద్దరినీ ఒక దగ్గర నిలబెట్టిన ప్రీతి సోదరులు.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారిపై తూటాల వర్షం కురిపించారు. ఈ దుశ్చర్యలో బాధితురాలి తండ్రి సైతం పాలుపంచుకున్నారు. ప్రీతి అక్కడికక్కడే మృతి చెందింది. సోనూకు పొట్టలో తూటా తగిలింది. ఆ తర్వాత అతని తలపై ఇటుకరాయితో దాడి చేశారు. చనిపోయినట్లు భావించి అక్కడి నుంచి పారిపోయారు.

Honor killing
ప్రీతి

పరువు హత్య విషయం ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సోనూను స్థానిక వైద్య కళాశాలకు తరలించారు. చికిత్స పొందుతూ సోనూ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలను పోస్ట్​మార్టానికి తరలించారు పోలీసులు.

ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: చిన్నారిపై పిన్ని కర్కశం.. చేతులు విరగ్గొట్టి.. ముఖంపై దాడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.