అప్పుడప్పుడు చిన్న చిన్న జీవులు మనుషులకు పెద్ద ఇబ్బందులు కలిగిస్తుంటాయి. కోల్కతా విమానాశ్రయంలో ఇటీవల అలాంటి ఘటనే జరిగింది. ప్రయాణికులు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న విమానాలపై.. తేనెటీగలు తిష్ట వేశాయి.
ఆదివారం మధ్యాహ్నం కోల్కతా నుంచి దిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విస్తారా విమానంపై తేనెటీగల గుంపు వాలడం గుర్తించిన సిబ్బంది... ప్రయాణికులు ఎక్కకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న అనుభవం లేకపోవడం వల్ల.. ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఏం చేయాలో పాలుపోవలేదు. చాలా సేపటి తర్వాత జల ఫిరంగులతో వాటిని చెదరగొట్టగలిగారు.
తేనెటీగలు అక్కడి నుంచి వెళ్లిపోయినా.. అవి విమానంలోకి చొరబడ్డాయనే అనే అనుమానంతో లోపల ఫ్యుమిగేషన్ చేశారు. ఆ తర్వాత ప్రయాణికులను అనుమతించారు. ఫలితంగా ఆదివారం మధ్యాహ్నం గంట ఆసల్యంగా విస్తారా విమానం దిల్లీ బయల్దేరింది.
సోమవారం ఉదయం పోర్ట్ బ్లెయిర్ వెళ్లాల్సిన మరో విమానంపైనా భారీ సంఖ్యలో తేనెటీగలు వాలాయి. వాటిని కూడా జలఫిరంగులతో చెదరగట్టిన తర్వాత ప్రయాణికులను లోనికి అనుమతించారు సిబ్బంది. ఈ విమానం కూడా తేనెటీగల వల్ల గంట ఆలస్యంగా బయల్దేరింది.
ఈ ఘటనల నేపథ్యంలో తేనెటీగలు విమానాశ్రయంలోకి రాకుండా చూసేందుకు ఆ ప్రాంతంలో రసాయనాలు పిచికారీ చేశారు సిబ్బంది.
ఇదీ చూడండి:మనిషిని తొక్కిన గజరాజు- వీడియో వైరల్