దేశంలో పెద్ద బ్రాండుల పేరుతో అమ్ముతున్న తేనె.. కల్తీమయమేనని పర్యావరణ నిఘా సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చింది. పెద్ద వ్యాపార సంస్థలూ తేనెను చక్కెర పాకంతో కల్తీ చేస్తున్నాయని తెలిపింది. 13 పెద్ద, చిన్న బ్రాండ్లు విక్రయిస్తున్న తేనెను పరీక్షించగా... వీటిలో 77శాతం షుగర్ సిరప్‌తో కల్తీ చేస్తున్నట్లు నిర్ధరణ అయిందని వెల్లడించింది. మొత్తం 22 శాంపిల్స్‌కు న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెస్పాన్స్ టెస్ట్ చేయగా.... ఐదు మాత్రమే నాణ్యమైనవిగా తేలాయని సీఎస్ఈ వివరించింది.
మొదట పాస్.. తర్వాత ఫెయిల్
ఈ బ్రాండ్ల నమూనాలను గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ)లోని సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్(సీఏఎల్ఎఫ్)లో మొదట పరీక్షించారు. ఇందులో అన్ని పెద్ద బ్రాండ్లు పాస్ అవగా... చిన్న బ్రాండ్లలో చెరకు రసంలో ఉండే సీ4 షుగర్ ఉన్నట్లు తేలింది. అయితే అవే బ్రాండ్ల శాంపిళ్లను జర్మనీలోని ఓ ప్రత్యేక లేబరెటరీలో ఎన్ఎంఆర్ పరీక్ష చేయగా 3 బ్రాండులు మాత్రమే పాసయ్యాయిని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: మహిళతో అసభ్య ప్రవర్తన- అడ్డొచ్చిన వ్యక్తిపై కాల్పులు