Home Tips To Get Rid Of Rats : ఇంట్లోకి ఒకటి రెండు ఎలుకలు దూరితే చాలు.. కొద్ది రోజుల్లోనే అవి పెద్ద సైన్యాన్నే తయారు చేస్తాయి. ఆ తర్వాత వాటి అరాచకం మామూలుగా ఉండదు. ఇంట్లో గుంతలు తవ్వడం నుంచి.. వస్తువులు, దుస్తులు పాడుచేయడం వరకూ అన్నీ చేసేస్తాయి. దీంతో.. ఈ ఎలుకల బాధను తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తారు జనం. బోను నుంచి పెస్టిసైడ్స్ వరకు అన్నీ ప్రయోగిస్తారు. కానీ.. పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే.. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎలుకల బెడద నుంచి తప్పించుకోవచ్చని మీకు తెలుసా? మరి.. ఎలాంటి పదార్థాలను ఉపయోగించి ఎలుకలను తరిమికొట్టవచ్చో.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పుదీనా ఆయిల్..
పుదీనా ఆయిల్ వాసనను ఎలుకలు అస్సలు ఇష్టపడవు. ఈ వాసన మనకు రిఫ్రెషింగ్‌గా అనిపించినా.. ఎలుకలకు మాత్రం చిరాకు పుట్టిస్తుంది. ఎలుకలను తరిమికొట్టేందుకు చిన్న క్లాత్‌పై కొంచెం పుదీనా నూనెను చల్లి, ఎలుకలు వచ్చే ప్రవేశద్వారం, మూలలు, రంధ్రాలలో ఉంచండి. 2 లేదా 3 రోజులకు ఒకసారి వస్త్రాన్ని మార్చండి. ఇలా చేయడం వల్ల ఎలుకలు రాకుండా ఉంటాయి.
బొప్పాయితో వారంలో 2కిలోల వెయిట్ లాస్! ఇందులో నిజమెంత? డాక్టర్లు ఏమంటున్నారు?
ఉల్లిపాయలు..
ఉల్లి నుంచి వచ్చే ఘాటైన వాసన ఎలుకలకు చిరాకు తెప్పిస్తుంది. ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి.. ఎలుకలు వచ్చే ప్రదేశం, మూలల్లో పెట్టండి. ఉల్లిపాయలు తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతీ 2 రోజులకు ఒకసారి మార్చండి.
వెల్లుల్లి..
వెల్లుల్లి వాసనంటే ఎలుకలకు పడదు. తరిగిన వెల్లుల్లిని నీళ్లలో కలిపి ఎలుకలను తరిమికొట్టే మందును తయారు చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి నీళ్లను ఒక సీసాలో పోసి స్ప్రే లాగా ఎలుకలు ఉండే మూలల్లో పిచికారీ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలుకలు రావు.
లవంగాలు..
లవంగాల వాసనను కూడా ఎలుకలు ఇష్టపడవు. ఇందుకోసం కొన్ని లవంగాలను క్లాత్‌లో వేసి.. చిన్న మూటలా కట్టి ఎలుక వచ్చే మూలల్లో పెట్టండి.
బంగాళాదుంప పొడి..
బంగాళాదుంప పొడితో కూడా ఎలుకలను తరిమికొట్టవచ్చు. ఈ పౌడర్‌ను ఇంట్లో ఎలుకలు ఉండే మూలలు, ఎక్కువ తిరిగే ప్రదేశాల్లో చల్లాలి. ఎలుకలను ఆకర్షించడానికి పౌడర్‌లో కొద్దిగా ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్‌ను తిన్న ఎలుకలు నీళ్ల కోసం బయటికి వచ్చి దాహంతో చనిపోతాయి.
హాట్ పెప్పర్ ఫ్లేక్స్..
వీటి ఘాటుకు మనకే నాన్ స్టాప్‌గా తుమ్ములు వస్తాయి. కాబట్టి, హాట్ పెప్పర్ ఫ్లేక్స్ నుంచి ఎలుకలు తప్పించుకోలేవు. ఎలుకలు ఉండే మూలల్లో ఎండు మిర్చి కారాన్ని చల్లండి. దీంతో ఎలుకలు మీ ఇంట్లో అస్సలు ఉండలేవు.
వంట సోడా..
ప్రతి ఇంట్లో వంట సోడా ఉంటుంది. ఈ వంట సోడాను ఉపయోగించి ఎలుకలను తరిమికొట్టవచ్చు. ముందుగా.. పీనట్ బటర్‌లో బేకింగ్ సోడాను కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బఠాణీ సైజ్‌లో ఉండలుగా చేసి.. ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో, మూలల్లో పెట్టండి. అంతే.. ఎలుకలు పరార్ అయిపోతాయి.
ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!
మెంతులతో ఎన్ని లాభాలో- మొటిమలకు చెక్- మీ ముఖంలో గ్లో పక్కా!