జమ్ముకశ్మీర్ ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని హంద్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు. మట్టుబెట్టిన ఉగ్రవాదిని హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ ఉబాయిద్గా అధికారులు గుర్తించారు. ఉబాయిద్ పలు తీవ్రవాద కార్యకలాపాల్లో భాగమైనట్లు అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్ జవానులు, స్థానిక పోలీసులు కార్టన్ సర్చ్‌లో భాగంగా సోదాలు నిర్వహిస్తుండగా.. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో స్పందించిన భద్రతాదళాలు ఉబాయిద్ను కాల్చి చంపాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో నక్కినట్లు భద్రతాదళాలు భావిస్తున్నాయి. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది.
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ హతం - encounter in jammu and kashmir
06:32 July 07
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్