ETV Bharat / bharat

Hitech Copying in JEE Exam : జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై అత్యాశ.. మార్కుల కోసం అడ్డదారి.. ఆపై బలి

JEE Advanced Exam Copying In Hyderabad : జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష చూచిరాతలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులను పోలీసులు నిందితులుగా చేర్చారు. వీళ్లంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని సమాధానాలు చేరవేసుకున్నట్లు గుర్తించారు. ఈ నెల 4న జరిగిన జేఈఈ పరీక్ష ప్రారంభమైన తర్వాత చూచిరాత జరుగుతున్నట్లు గుర్తించిన ఇన్విజిలేటర్లు పోలీసులకు సమచారం ఇవ్వడంతో విద్యార్థుల బండారం బయటపడింది.

JEE Advanced
JEE Advanced
author img

By

Published : Jun 7, 2023, 7:29 AM IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కేసులో నలుగురి విద్యార్థుల అరెస్ట్

Hitech Copying in JEE Exam in Hyderabad : ఓ కార్పోరేట్ కళాశాలలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్​లో అర్హత సాధించారు. ఆ తర్వాత అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి మార్కులు సాధించాలని కలలు కన్నారు. దీని కోసం అడ్డదారిని ఎంచుకున్నారు. ఎస్సెస్సీతో పాటు, ఇంటర్​లోనూ ఎక్కువ మార్కులు సాధించడంతో పాటు, జేఈఈ మెయిన్స్​లోనూ ప్రతిభ కనబర్చిన విద్యార్థి సాయం తీసుకోవాలని ప్రణాళిక రచించారు. స్నేహితులు అడగడంతో సదరు విద్యార్థి కూడా అంగీకరించాడు.

ఐదుగురు ఇంటర్ విద్యార్థులు కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. తమకు వచ్చిన సమాధానాలను ఒకరికొకరు చేరవేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం మొబైళ్లను పరీక్షా కేంద్రంలోకి ఎలా తీసుకెళ్లాలనే ప్రణాళికను ముందే సిద్ధం చేసుకున్నారు. అందరు విద్యార్థులకంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఆ తర్వాత మొబైల్‌ను ఆవరణలో దాచి అక్కడి నుంచి తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా మూత్రశాలలో దాచారు. పరీక్ష ప్రారంభమయ్యే ముందే మూత్రశాలకు వెళ్లి మొబైల్‌ను తమ వెంట తెచ్చుకున్నారు. ఆ తర్వాత సమాధానాలను ఒకరికొకరు చేరవేసుకున్నారు. ఈ క్రమంలో ఇన్విజిలెటర్‌కు దొరికిపోయారు.

Copying in JEE Advanced Exam : నాచారంలోని అయాన్ డిజిటల్ సెంటర్‌లో రెండు పరీక్షా కేంద్రాలున్నాయి. కూకట్‌పల్లికి చెందిన అన్నదమ్ముళ్లు ఆ రెండు సెంటర్లలో పరీక్ష రాశారు. 4వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఓ విద్యార్థి వద్ద మొబైల్ ఫోన్ ఉన్నట్లు ఇన్విజిలేటర్ ఉదయం 11గంటల సమయంలో గుర్తించారు. వెంటనే పరిశీలకుడికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెండు సెంటర్లలో చూచిరాత : పోలీసులు విద్యార్థి ఫోన్ స్వాధీనం చేసుకొని పరిశీలించగా వాట్సాప్ గ్రూప్ ఉన్నట్లు తేలింది. అందులో ఐదురుగు విద్యార్థులున్నట్లు గుర్తించారు. విద్యార్థి సోదరుడు పక్కనే ఉన్న మరో సెంటర్‌లో పరీక్ష రాస్తున్నట్లు తేల్చిన పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకొని మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. సోదరులిద్దరూ ఇచ్చిన సమాచారం ప్రకారం మిగతా ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాస్తున్న సెంటర్ నిర్వాహకులను అప్రమత్తం చేశారు.

సికింద్రాబాద్​లోని ఎస్​వీఐటీ, మౌలాలీ, ఎల్బీనగర్​లలో ఉన్న అయాన్ డిజిటల్ సెంటర్​లో పరీక్ష రాసిన ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని వాళ్ల మొబైల్స్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులపై పోలీసులు చూచిరాత కింద కేసు నమోదు చేసి 41ఏ సీఆర్పీసీ నోటీసులిచ్చారు. 3రోజుల్లో సమాధానాలివ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఐదుగురు విద్యార్థులపైనా చూచిరాత కింద కేసు నమోదు చేయడంతో వాళ్ల చదువు ప్రశ్నార్థకంగా మారింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు మార్కులు సంపాందించాలనే కోరికతో చూచిరాతకు పాల్పడి జేఈఈ కలను చెరిపేసుకున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.