రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ మృతి పట్ల.. కాంగ్రెస్ సంతాపం తెలిపింది. రైతు ప్రయోజనాల కోసం ఆయన ఎనలేని పోరాటం చేశారని, ఆ సేవలు చిరస్మరణీయమని అభిప్రాయపడింది. ఈ క్లిష్ట సమయంలో అజిత్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు సానుభూతిని ప్రకటించింది హస్తం పార్టీ.
ఆర్ఎల్డీ నాయకుడి మరణ వార్త.. చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు రాహుల్.
'సమాజానికి తీరని లోటు'
సింగ్ మృతిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
"ప్రజాదారణ పొందిన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, రైతు సన్నిహిత నాయకుడు చౌదరి అజిత్ సింగ్ జీ మరణం చాలా విచారకరం. చౌదరి సాహబ్ మృతి.. సమాజానికి, రాజకీయాలకు తీరని లోటు."
- ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
'ఆయన.. నేలతల్లి బిడ్డ'
కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా కూడా అజిత్‌సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అజిత్.. రైతుల శ్రేయోభిలాషి, నేలతల్లి బిడ్డ అని కొనియాడారు. 'ఆయన మరణంతో.. నేడు రైతుల గొంతు మూగబోయింద'ని సుర్జేవాలా అన్నారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ లేక ఐసీయూకి తాళం.. ఎనిమిది మంది మృతి