కొవిడ్-19కి ముందే మతతత్వం, కఠినమైన జాతీయవాదం అనే రెండు మహమ్మారులకు బాధితురాలిగా సమాజం మారిందంటూ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలపై భాజపా సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. హిందుత్వం అనేది ఎప్పుడూ కఠినమైనది కాదన్నారు. ఎల్లప్పుడూ సహనాన్నే ప్రబోధిస్తుందని, ఇది భారతదేశ ప్రాచీన జీవనవిధానమని చెప్పారు.
హిందువులు ఎవరిపైనా, ఏ దేశంపైనా, ఏ రాష్ట్రం మీదా దాడులు చేయలేదన్నారు. హిందుత్వం ఎల్లప్పుడూ సహనాన్ని బోధించటం వల్లే భారతదేశంలో అనేక విశ్వాసాలు, కులాలకు చెందిన ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు.
ఈ నెల 23 నుంచి మహారాష్ట్రలో 9 నుంచి 12 తరగతులకు పాఠశాలలు తెరిచే అంశంపై ఆయన స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవటం వల్ల కరోనా కేసులు పెరిగిన అనుభవాలను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలని సూచించారు.