హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఎడతెరిపిలేని హిమపాతంతో పలు ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలోని మలన ప్రాంతాన్ని మంచు దుప్పటి కమ్మేసింది. సిమ్లాలోని జకూ ప్రాంతం శ్వేతవర్ణశోభితంలో దర్శనమిస్తూ కనువిందు చేస్తోంది. రాష్ట్ర రాజధాని సిమ్లాలోని మంచులో పర్యటకులు ఉత్సాహంగా గడుపుతున్నారు.








రాజ్‌ఘర్‌లో అలర్ట్..
రాజ్ఘర్లాంటి పలు చోట్ల భారీగా మంచు కురుస్తుండటం వల్ల వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 5 వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయన్నారు.
అటల్ టన్నెల్ మూత..
హిమపాతంతో సొరంగాల వంటి ప్రాంతాలకు పర్యాటకుల్ని అనుమతించటంలేదు. అటల్‌టన్నెల్ సందర్శనను ఫిబ్రవరి 5 వరకు నిలిపేశారు.
ఇదీ చూడండి: మంచు దుప్పటిలో శ్వేతవర్ణ శోభితంగా ఉత్తరాఖండ్