ETV Bharat / bharat

Himachal Pradesh Landslide : హిమాచల్​ వరదలకు 217 మంది బలి.. ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన.. పంజాబ్​లో వేల ఎకరాల్లో పంటనష్టం - దిల్లీ యమునా నది

Himachal Pradesh Landslide Update : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వరదలు, కొండచరియలు సృష్టించిన బీభత్సానికి మరణించిన వారి సంఖ్య 74కు చేరింది. జూన్‌ నెలలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 217 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరోవైపు, పంజాబ్‌లో వరదల్లో చిక్కుకున్న దాదాపు 3 వందల మందిని సహాయక బృందాలు.. సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 18, 2023, 10:24 AM IST

Updated : Aug 18, 2023, 10:57 AM IST

Himachal Pradesh Landslide Update : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరద కష్టాలు కొనసాగుతున్నాయి. వరదలు, కొండచరియలు సృష్టించిన బీభత్సానికి చనిపోయిన వారి సంఖ్య 74కు చేరింది. శిమ్లాలో సోమవారం సమ్మర్‌ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు విరిగిపడిన శిథిలాల కింద.. మరో మృతదేహాన్ని వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. చంబా జిల్లాలో వర్షాల కారణంగా మరో ఇద్దరు మరణించినట్లు వెల్లడించారు.

ఇప్పటివరకు 217 మంది బలి..
Himachal Pradesh Floods : కాంగ్రా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 309 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. గత మూడు రోజుల్లో 2,074 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు తెలిపారు. జూన్‌ నెలలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 217 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. వర్షాకాల మెుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7,500 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు వెల్లడించారు.

వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం..
Himachal Pradesh Rains : మరోవైపు, మండి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను హిమాచల్​ ముఖ్యమంత్రి సుఖ్విందర్​ సింగ్ సుఖు సందర్శించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను పునరుద్ధరించేందుకు బాధిత కుటుంబాలకు తక్షణమే లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వర్షాల కారణంగా భారీగా నష్టపోయిన గ్రామ పంచాయతీ గెహ్రాకు చెందిన 23 కుటుంబాలను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు. వారు ఆశ్రయం పొందిన సహాయక శిబిరాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్నిఆదేశించారు.

వరదల్లో చిక్కుకున్న 3వేల మందిని..
Punjab Floods : పంజాబ్‌లో వరదల్లో చిక్కుకున్న దాదాపు 3 వందల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కపుర్తలా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 300 మందిని సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. రక్షించిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 5,500 వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 5 వేల ఎకరాల పంట నీట మునిగినట్లు తెలిపారు. భాక్రా డ్యామ్ నుంచి అదనపు నీటిని బియాస్ నదిలోకి విడుదల చేయడం వల్ల హోషియార్‌పుర్, గురుదాస్‌పుర్‌, రూప్‌నగర్, కపుర్తలా జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 22 పైగా గ్రామాలు వరదలకు గురయ్యాయని వెల్లడించారు. హోషియార్‌పుర్‌ జిల్లాలోని వరద ప్రభావ ప్రాంతాలను సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌ సమీక్షించారు.

భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం..
Uttarakhand Rains : ఉత్తరాఖండ్​లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. దెహ్రాదూన్​లో అనేక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బాధిత ప్రజలకు అన్ని విధాల సహాయక చర్యలను ఎస్​డీఆర్​ఎఫ్​ చేపట్టింది. మరోవైపు రిషికేశ్‌లో ముందుజాగ్రత్త చర్యగా రాంఝూలా వంతెనపై ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. రిషికేశ్‌లో గంగా నది నీటిమట్టం పెరుగుతున్న తీరును కూడా సమీక్షించారు.

తగ్గిన యమునా నది నీటిమట్టం..
Delhi Yamuna Water Level : దిల్లీలో యమునా నది నీటమట్టం.. ప్రమాదకర స్థాయి కన్నా తక్కువగానే ఉంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు యమునా నీటిమట్టం 203.92 మీటర్లుగా నమోదైంది. గతనెలలో భారీ వర్షాల కారణంగా దేశ రాజధానిలో వరదలు సంభవించాయి. ఆ సమయంలో యమునా నది నీటమట్టం అత్యధికంగా 208 మీటర్లకుపైగా నమోదైంది.

Last Updated : Aug 18, 2023, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.