ETV Bharat / bharat

50ఏళ్లుగా టమాటా సాగు.. ఇప్పుడు 'లాభాల పంట'.. నెలలోనే కోటీశ్వరుడిగా మారి.. - టమాటా ధర పెంపు

Tomato Farmer Crorepati : దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు.. ఓ రైతును కోటీశ్వరుడిని చేశాయి. సుమారు 37 ఎకరాల్లో సాగు చేసిన ఆ రైతు.. 8వేలకు పైగా టమాటా బాక్సులు అమ్మి.. రూ.1.10 కోట్లు సంపాదించారు. 50 ఏళ్లుగా టమాటానే సాగు చేస్తున్నా.. ఈ ఏడాది మాత్రం ఆయన 'లాభాల' పంట పండింది!

Tomato Farmer Crorepati
Tomato Farmer Crorepati
author img

By

Published : Jul 19, 2023, 6:59 AM IST

Tomato Farmer Crorepati : దేశవ్యాప్తంగా టమాటా ధరలు.. భగ్గుమంటున్నాయి. కిలో టమాటా ధర రూ.150 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. దీంతో అనేక మంది ప్రజలు.. టమాటాలను కొనుగోలు చేయలేక వాటిని వినియోగించడం ఆపేశారు. మరికొందరు కొనుగోలు చేసినా.. తక్కువగా వాడుతున్నారు. పెద్ద రెస్టారెంట్లు అయితే ఏకంగా టమాటాతో తయారు చేసిన వంటకాల విక్రయాలను నిలిపివేశాయి. ఇవన్నీ పక్కనపెడితే.. ఈ టమాటా ధరలు.. దేశంలో కొందరు రైతులను కోటీశ్వరులను చేస్తున్నాయి. మార్కెట్​లో మంచి ధర పలుకుతుండడం వల్ల వారు భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.

తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లా బాల్హ్‌ లోయకు చెందిన 67 ఏళ్ల జైరామ్‌ సైనీ సుమారు 37 ఎకరాల్లో సాగు చేసిన టమాటా పంట కాసుల వర్షం కురిపించింది. దాదాపు 8,300 బాక్సులు అమ్మడం ద్వారా రూ.1.10 కోట్లు తన ఖాతాలో వేసుకున్నారు. 50 ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నా.. ఈ ఏడాది మాత్రమే ఆయన పంట పండింది. గతేడాది ఇదే సమయంలో 10 వేల టమాటా బాక్సులు విక్రయించానని.. దీనికి గాను రూ. 55 లక్షలు మాత్రమే వచ్చినట్లు సైనీ తెలిపారు.

కుమారుల సహాయంతో..
Tomato Farmers News : వ్యవసాయంలో జైరామ్​​ సైనీకి తన ఇద్దరు కుమారులు సహాయం చేస్తుంటారు. పెద్ద కుమారుడు సతీశ్​.. స్థానిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తూనే.. తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉంటున్నారు. చిన్న కుమారుడు మనీశ్​.. తండ్రితో ఎప్పుడూ వ్యవసాయంలో తోడుగా ఉంటారు. అయితే తాము పండించిన టమాటాను దిల్లీలోని ఆజాద్​పుర్​కు పంపామని.. అక్కడ చాలా లాభం వచ్చిందని సతీశ్ తెలిపారు.

వర్షాలు లేకుంటే మరింత లాభం..
అయితకే ఈ ఏడాది తాను 37 ఎకరాల్లో 1.5 కిలోల టమాటా విత్తనాలను వేసినట్లు జైరామ్​ తెలిపారు. ఇప్పటి వరకు 8,300 బాక్సులు అమ్మినట్లు.. మరో 500 పెట్టెలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హిమాచల్​ ప్రదేశ్​లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు తాను పండించిన పంట బాగా దెబ్బతినిందని.. లేదంటే ఇప్పటికే 12వేల బాక్సుల టమాటాలను విక్రయించేవాడినని వివరించారు.

Tomato Farmer Crorepati
జైరామ్‌ సైనీ, టమాటా రైతు

యువత ఉద్యోగాల బదులు..
తన పొలంలో జైరాం.. టమాటాలతో పాటు ఇతర కూరగాయలను కూడా పండిస్తారు. వ్యవసాయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన.. స్థానిక రైతులకు సూచనలు అందిస్తుంటారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై తగిన సలహాలిస్తుంటారు. తరచుగా మార్కెట్​లోకి వచ్చే కొత్త పరికరాలను పొలంలో వినియోగించి లాభపడాలని జైరాం.. రైతులకు సూచిస్తున్నారు. యువత ఉద్యోగాలకు బదులు వ్యవసాయం చేయాలని కోరుతున్నారు.

ఆ డబ్బుతో..
టమాటా సాగుతో కోటీశ్వరుడిగా మారిన రైతు జైరామ్​ గురించే ఆ ప్రాంతమంతా చర్చ జరుగుతోంది. అయితే ఆ డబ్బుతో తాను కొత్త ట్రాక్టర్​ కొనుగోలు చేస్తానని జైరామ్​ తెలిపారు. దీంతోపాటు పొలంలో వినియోగించే కొన్ని ఆధునిక పనిముట్లును కూడా కొంటానని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.