ETV Bharat / bharat

ఐదేళ్లలో సీఎం సంపద డబుల్.. కొత్తగా రూ.కోట్ల ఆస్తి.. బంగారం ఎంత ఉందంటే? - jairam thakur assets

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ మేరకు తన నియోజకవర్గంలో నామినేషన్ వేసిన ఆయన.. తనకు మొత్తం రూ.6.28 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు.

himachal-cm-jairam-thakur-files-nomination

author img

By

Published : Oct 20, 2022, 2:14 PM IST

Updated : Oct 20, 2022, 4:08 PM IST

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఆస్తులు ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న ఆయన.. ఈ మేరకు నామినేషన్ వేశారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం జైరాం ఠాకూర్ మొత్తం ఆస్తుల విలువ రూ.6.28 కోట్లు. 2017 ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్​లో తన ఆస్తులు రూ.3.27కోట్లుగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో దాదాపు రూ.3కోట్ల ఆస్తి పెరిగినట్లు తెలుస్తోంది.

గడిచిన ఐదేళ్లకు తన ఆదాయం రూ.1.80 కోట్లు అని జైరాం ఠాకూర్ ప్రకటించారు. వీటిపై ఆదాయ పన్ను కట్టినట్లు తెలిపారు. సీఎం అఫిడవిట్​లోని వివరాల ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో ఆయన భార్య సంపాదన రూ.1.5 కోట్లు. దీనిపైనా ఆమె పన్ను చెల్లించారు. ఇకపోతే, ముఖ్యమంత్రికి మూడు బంగారపు ఉంగరాలు, ఓ గోల్డ్​చైన్ ఉన్నాయి. వీటి విలువ రూ.3.1లక్షలు. సీఎం భార్యకు రూ.17లక్షలు విలువ చేసే 375 గ్రాముల బంగారం ఉంది. వీరికి ఇద్దరు సంతానం కాగా.. చెరో వంద గ్రాముల చొప్పున బంగారం ఉంది. ఈ బంగారం విలువ రూ.11.40 లక్షలు.

1993లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జైరాం ఠాకూర్​కు ఎదురుదెబ్బ తగిలింది. 26 ఏళ్ల వయసులోనే చచ్యోట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన.. ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1998లో మరోసారి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం మొత్తం ఐదుసార్లు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చచ్యోట్ స్థానం.. సిరాజ్​గా మారింది. ఇప్పుడు ఏడోసారి ఇక్కడి నుంచి బరిలో దిగుతున్నారు.

మిగతా 6 స్థానాలకు అభ్యర్థుల ఖరారు: తొలుత 62 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.. మిగిలిన 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో ఇద్దరు సిట్టింగ్ అభ్యర్థులు కాగా.. మరో ఇద్దరిని స్థాన చలనం చేశారు. ఇద్దరు కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. హిమాచల్​ ప్రదేశ్​లోని 68 స్థానాలకు నవంబర్​ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్​ 8న ఫలితం వెలువడనుంది.

ఇదీ చదవండి:

Last Updated : Oct 20, 2022, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.