ETV Bharat / bharat

'క్వార్టర్ అంటే 30ఎంఎల్​ సర్​..' స్టూడెంట్​ మాటకు టీచర్​ షాక్​! - teacher student viral video

ఓ ఆన్​లైన్​ క్లాస్​లో టీచర్​- స్టూడెంట్​ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ వీడియోకు లక్షల వ్యూస్​ వచ్చాయి. ట్విట్టర్​లో వీడియోపై మీమ్స్​ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ ఫన్నీ సంభాషణను మీరూ చూసేయండి.

Online class viral video
30ml
author img

By

Published : Oct 11, 2021, 6:04 PM IST

స్కూళ్లు, కాలేజీల్లో క్లాస్​రూం సరదాలే వేరు! ఒక్కోసారి టీచర్​- స్టూడెంట్స్​ మధ్య జరిగే ఫన్నీ సంభాషణలతో క్లాస్​రూం మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆన్​లైన్​ క్లాసులు, సామాజిక మాధ్యమాల పుణ్యమా అని.. ఎక్కడ ఏం జరిగినా ఇట్టే బయటకొచ్చేస్తోంది. తాజాగా.. ఓ టీచర్​-స్టూడెంట్​ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అయ్యింది.

ఆన్​లైన్​ సీఏ క్లాసు జరుగుతుండగా.. 'క్వార్టర్​లో ఎంత ఉంటుంది? హత్విక్​.. ఒక్క క్వార్టర్​లో ఎంత ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు' అంటూ ఉపాధ్యాయుడు ప్రశ్న వేశారు. అందుకు ఈ విద్యార్థి ఇచ్చిన సమాధానం విని ఆ టీచర్​ మైండ్​ బ్లాంక్​ అయ్యింది.

'30ఎంఎల్​ సర్​,' అని తొలుత విద్యార్థి బదులిచ్చాడు. టీచర్​ అడిగిన క్వార్టర్​ ప్రశ్నకు విద్యార్థి 'మందు సీసా'కు తగ్గట్టు జవాబు ఇవ్వడం వల్ల అది విన్న అందరు తెగ నవ్వుకున్నారు. వెంటనే టీచర్​ అందుకుని '30ఎంఎల్​ ఆఆ? అరే బాబు.. నేను అడిగేది ఆ క్వార్టర్​ గురించి కాదు,' అని కోపంగా చెప్పారు. వెంటనే సరిచేసుకున్న ఆ విద్యార్థి 'ఫోర్​ సర్​.. ఫోర్​' అని అనడం వీడియో చివర్లో వినిపించింది.

కోపంగా ఉన్న సమయంలో టీచర్​ ఇచ్చిన ఎక్స్​ప్రెషన్స్​.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్​గా దర్శనమిస్తున్నాయి.

ఇన్​స్టాగ్రామ్​లోని ఈ వీడియోకు లక్షల వ్యూస్​ రాగా.. ట్విట్టర్​లో వీడియోకు సంబంధించిన మీమ్స్​ విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చూడండి:- కారెక్కిన ఆవు.. బర్గర్ల కోసం మెక్​డోనాల్డ్స్​కు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.