ETV Bharat / bharat

'హిజాబ్​పై నిషేధం వెనక్కి, ఇక ఎలాంటి ఆంక్షలు ఉండవు'- కర్ణాటక సీఎం ప్రకటన - కర్ణాటక హిజాబ్ నిషేధం తొలగింపు

Hijab Ban Revoked In Karnataka : హిజాబ్​ ధారణపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని ఆదేశించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఎవరైనా హిజాబ్ ధరించవచ్చని స్పష్టం చేశారు.

Hijab Ban Revoked In Karnataka
Hijab Ban Revoked In Karnataka
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 10:41 PM IST

Hijab Ban Revoked In Karnataka : కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్​పై ఉన్న నిషేధాన్ని తొలగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. ఎవరైనా హిజాబ్ ధరించవచ్చని సీఎం స్పష్టం చేశారు. కర్ణాటక స్టేట్ పోలీస్, మైసూరు జిల్లా పోలీస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్మించిన మూడు పోలీస్ స్టేషన్​లను సిద్ధ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హిజాబ్​పై ఒకరు ప్రశ్నించగా ఈ మేరకు సీఎం వివరణ ఇచ్చారు. వస్త్రధారణ అనేది వ్యక్తిగత ఛాయిస్ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. డిసెంబర్ 23 నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పారు.

"హిజాబ్ నిషేధం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించా. ఎవరైనా హిజాబ్ ధరించవచ్చు. నేను ధోతీ, జుబ్బా ధరిస్తున్నా. మీలో కొందరు ప్యాంటు, షర్టు ధరించారు. ఇందులో తప్పేం ఉంది? మీరు ఏదైనా తినొచ్చు. ఏదైనా ధరించవచ్చు. ఓట్ల కోసం ఇలాంటి రాజకీయాలు చేయడం తప్పు. వారు సబ్​కా సాత్, సబ్​కా వికాస్ అంటుంటారు. కానీ టోపీ, బుర్ఖా ధరించిన వారిని పక్కన పెడతారు. వారి ఉద్దేశం ఏంటి? మా ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుంది."
- సిద్ధరామయ్య, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి

కాగా, కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధరామయ్య- ముఖ్యమంత్రినైన తనతో పాటు అధికారులందరికీ ప్రజలు చెల్లించే పన్నుల నుంచే వేతనం లభిస్తోందని తెలిపారు. ప్రతి అధికారి ఇది గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజా సేవే అందరికీ ప్రాధాన్యం కావాలని అన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే వారందరికీ గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను ఓపికతో వినాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్​లు పీపుల్ ఫ్రెండ్లీగా మారాలని అభిలషించారు.

'పోలీసులకు లా అండ్ ఆర్డర్ తొలి ప్రాధాన్యం అయి ఉండాలి. ఆమోదయోగ్యమైన భాష ఉపయోగించాలి. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసులు ఉంటేనే అక్కడ శాంతియుత జీవనం సాధ్యమవుతుంది. హింసకు పాల్పడేవారికి కేంద్రాలుగా పోలీస్ స్టేషన్​లు మారకూడదు. అణగారిణ ప్రజలకు న్యాయం చేయాలి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. డబ్బు ఉంటేనే న్యాయం జరుగుతుందన్న భావన ఉండకూడదు. డబ్బు ఉన్నవారితో, శక్తిమంతులతో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటకాగొద్దు' అని సీఎం సిద్ధరామయ్య హితవు పలికారు.

తీవ్ర దుమారం రేపిన ఆ నిర్ణయం
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం విద్యా సంస్థల్లో హిజాబ్​ ధారణపై నిషేధం విధించింది. హిజాబ్ ధరించిన విద్యార్థులను కాలేజీలలోకి అనుమతించలేదు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ముస్లిం విద్యార్థినులు తీవ్రంగా వ్యతిరేకించారు. పలు ప్రాంతాల్లో నిరసనలు చేశారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లింది.

'బడిలో మత స్వేచ్ఛ ఉంటుందా?'.. హిజాబ్​ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న

'దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా?'.. హిజాబ్​ కేసులో సుప్రీం వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.