High Court Judgement on Medical Seats Reservation in Telangana : రాష్ట్రంలో మెడికల్ సీట్ల రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదివిన లేదా నివసించిన వారే స్థానికుల అన్న నిబంధనను హైకోర్టు(High Court) తప్పుపట్టింది. రాష్ట్రంలో శాశ్వతంగా ఉన్న వ్యక్తులకి ఆ నిబంధన వర్తించదని ప్రకటించింది. ఈ అంశంలో సంబంధిత అధికారుల నుంచి నివాస ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలు తప్పనిసరి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇతర ప్రాంతాల్లో చదివినంత మాత్రాన స్థానికత వర్తించదనడం తగదని తీర్పు ఇచ్చింది.
Medical Seats Local Reservation in Telangana : జులై నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత.. నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల్లో.. కాంపిటీటివ్ అథారిటీ కోటాలోని సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 371-డీ ప్రకారం ప్రవేశ నిబంధనలను సవరించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ పేర్కొన్నారు. దీంతో 1820 మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు అదనంగా పొందుతున్నారు. జులై నెల ముందు వరకు ఉన్న నిబంధనల ప్రకాం వైద్య కళాశాలల్లోని మొత్తం సీట్లలో 85 శాతం కాంపిటీటివ్ అథారిటీ కోటా.. మిగిలిన 15 శాతం అన్‌రిజర్వుడ్ విభాగానికి చెందాయి. 2014 పునర్విభజన చట్టం ప్రకారం ఈ సీట్లకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడుతున్నారు.
వైద్య విద్య కళాశాలల్లో పెరగనున్న సీట్లు
Issue on Medical Seats Reservation in Telangana : రాష్ట్రం ఏర్పడ్డాక వైద్య కళాశాలల(Medical Colleges) సంఖ్య 56కు పెరిగింది. దీంతో సీట్లు మొత్తం 8440కి చేరుకుంది. పాత విధానమే కొనసాగితే కొత్తగా నిర్మించిన 36 వైద్య కళాశాలల్లోను 15 శాతం ఉమ్మడి కోటా అమలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల రాష్ట్ర విద్యార్థులు నష్టపోతారని గుర్తించిన ప్రభుత్వం.. ఉమ్మడి కోటాను పాత 20 కాలేజీలకే పరిమితం చేస్తూ నిబంధనలను సవరించింది. రాష్ట్ర విద్యార్థులకి డాక్టర్ కావాలనే వారికి మార్గం సులభం చేసిందని.. స్థానికంగా ఉండేవారికి లాభం చేకూరేలా నిబంధనలు సవరించిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వైద్య విద్యకు దూరమవుతున్న తెలంగాణ విద్యార్థులు దగ్గరవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. అదనంగా వచ్చిన వైద్య సీట్లలను ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రం ఏర్పాడిన తరవాత వైద్య విద్యలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రతి జిల్లాకో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడంతో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
'కాళోజీలో మెడికల్ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలి'
'దేశమంతటికి 157 వైద్య కళాశాలలు మంజూరు చేసి.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు'
Medical Reservation Seats : ఇకపై వంద శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే