TSPSC Paper Leak Case Latest Updates: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సంచలనం సృష్టిస్తోంది. ఈ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పేపర్ లీకేజీపై విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. లీకేజీపై హైకోర్టులో పిటిషన్ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ పిటిషన్ వేయగా.. కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు వాదనలు వినిపిస్తారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. పేపర్ లీకేజీ కేసులో నిరుద్యోగులు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రశ్నపత్రం లీకేజీ పిటిషన్‌ను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
TS High Court adjourned TSPSC paper leakage case ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలు సైతం రద్దు చేశాయి. గత ఏడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్, జనవరి 22న నిర్వహించిన ఏఈఈ, ఫ్రిబ్రవరి 26న నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ అధికారి పరీక్షా పత్రాలు లీకైనట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో... దీంతో ఆ మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి జూన్ 11న నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ ప్రకటించగా... మిగతా పరీక్షా తేదీలకు సంబంధించి త్వరలో వివరాలు వెల్లడించనుంది. మార్చి 5న నిర్వహించిన ఏఈ పరీక్షా పత్రం కూడా లీకైనట్లు తేలడంతో ఇది వరకే.. ఈ పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్,.. 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరి అసిస్టెంట్ ఉద్యోగాలకు పరీక్ష జరగక ముందే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బీజేపీ, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని.. లేదంటే.. సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గవర్నర్ తమిళిసైకు కూడా బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే గవర్నర్ తమిళిసై దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక దీనిపై ప్రతిపక్షాలు సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. నిరుద్యోగులు సైతం పరీక్షలు రద్దు కావడంతో.. నిరాశలో, అయోమయోంలో ఉన్నారు.
ఇవీ చదవండి: