జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో ప్రముఖ ఆహారశాల కృష్ణ దాబాపై దాడి కేసులో ఉగ్రవాదిని భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఆ త్వర్వాత అనంతనాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రస్థావరం ఉన్నట్లు కనుగొన్న బలగాలు దాన్ని ధ్వంసం చేశాయి.
మూడు ఏకే-56 రైఫిల్స్, రెండు చైనీస్ తుపాకులు, రెండు చైనాకు సంబంధించిన గ్రేనేడ్లు, ఒక టెలీస్కోప్, 6 ఏకే మ్యాగ్జీన్లను స్వాధీనం చేసుకున్నాయి.
ఏం జరిగింది?
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రముఖ ఆహారశాలపై ఫిబ్రవరి17న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పటిష్ట సైనిక పహారా ప్రాంతంలో ఉండే 'కృష్ణ దాబా' యజమాని కుమారుడిపై ముష్కరులు అత్యంత దగ్గరగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆకాశ్ మెహ్రా అనే బాధితుడు.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నిత్యం సైనిక పహారాలో ఉండే ఈ దాబా శాకాహార భోజనానికి ప్రసిద్ధి. శ్రీనగర్‌లోని దుర్గనాగ్ ప్రాంతంలో అత్యంత సున్నిత ప్రాంతంలో ఉంటుంది. 'ముస్లిం జన్ బాజ్' అనే నిషేధిత ఉగ్రసంస్థ ఈ కాల్పులకు బాధ్యత వహించింది.
ఇదీ చూడండి: బంగాల్ భాజపా అధ్యక్షుడి కాన్వాయ్‌పై రాళ్లదాడి